Sri ciry Tirupati Recruitment 2022: తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 400 డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు (APSSDC) చెందిన తిరుపతి జిల్లా శ్రీ సిటీలోనున్న డైకిన్ కంపెనీ.. డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టుల (Diploma Engineering Trainee Posts) భర్తీకి అర్హులైన..
Sri ciry Tirupati Diploma Engineering Trainee Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు (APSSDC) చెందిన తిరుపతి జిల్లా శ్రీ సిటీలోనున్న డైకిన్ కంపెనీ.. డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టుల (Diploma Engineering Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టుల సంఖ్య: 400
పోస్టుల వివరాలు: డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టులు
విభాగాలు: మెకానికల్, ప్రొడక్షన్, ఆర్‌ఏసీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్
పే స్కేల్: మొదటి ఏడాది రూ.1,99 లక్షలు రెండో ఏడాది రూ.2.43 లక్షలు మూడో ఏడాది రూ.3.02 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పదో తరగతితోపాటు, ఎటక్ట్రికల్/ఎటక్ట్రానిక్స్/మెకానికల్/ఆటోమొబైల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ప్రొడక్షన్/రెఫ్రెగెరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీరింగ్ విభాగాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి. మహిళా, పురుష అభ్యర్ధులు ఇరువురూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్ధులకు డైకిన్ సంస్థ తరపున నైపుణ్య శిక్షణ ఇస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు కింది ఆన్‌లైన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. https://forms.gle/rmxGjhTVNNH8PowA8
ఇంటర్వ్యూ తేదీ: దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు త్వరలో ఇంటర్వ్యూ తేదీని పంపిస్తారు
పూర్తి వివరాలకు 95050223016 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.