TTD: సికింద్రాబాద్ ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కాలేజీలో 2022-23 ప్రవేశాలకు నోటిఫికేషన్
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన సికింద్రాబాద్‌లోని ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల 2022-23 విద్యా సంవత్సరానికిగాను రెండేళ్ల ప్రీ డిగ్రీ, బీఏ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
Secunderabad SV Vedantawardini Sanskrit College Admissions 2022: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన సికింద్రాబాద్‌లోని ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల 2022-23 విద్యా సంవత్సరానికిగాను రెండేళ్ల ప్రీ డిగ్రీ, బీఏ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ సోమవారం (జులై 4) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రీ డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంస్కృతం ద్వితీయ భాషగా చదివిన, ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు బీఏ (ఓఎల్) డిగ్రీ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుంది. ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉచితంగా బస, భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు జూలై 5వ తేదీ నుంచి ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 30లోపు పోస్టు ద్వారా ‘శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల, 170- ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డు, బోయిన్ పల్లి, సికింద్రాబాద్-500011’ అడ్రస్‌కు అప్లికేషన్లను పంపవచ్చు. పూర్తి వివరాలకు 040 – 27750032, 9248813578, 990897 0007, 9441645995 నంబర్లను సంప్రదించవచ్చని టీటీడీ వర్గాలు తెలిపాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.