Lockdown: ప్రపంచానికి మరో పెనుముప్పు..! తేనెటీగలతో విస్తరిస్తోన్న వరోవా పరుగులు.. ఆస్ట్రేలియా లాక్‌డౌన్‌..

అడవులు, ఇతర సహజ ఆవాసాలలో కూడా ఈ పరాన్నజీవులు తేనెటీగలను చంపుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ప్రపంచ దేశాల్లో వరోవా జీవులు ఉన్నా ఇప్పటివరకు..

Lockdown: ప్రపంచానికి మరో పెనుముప్పు..! తేనెటీగలతో విస్తరిస్తోన్న వరోవా పరుగులు.. ఆస్ట్రేలియా లాక్‌డౌన్‌..
Honey Bees
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 05, 2022 | 10:57 AM

తేనెటీగలు తేనె పరిశ్రమకు పునాది. తేనెను తయారుచేసే ప్రక్రియలో పుప్పొడిని బదిలీ చేయడం, కొత్త విత్తనాలు మొలకెత్తేలా చేయడం కూడా ఉంటుంది. కాబట్టి తేనెటీగలు ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థకు చిహ్నంగా పరిగణించబడతాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేనెటీగలతో సహా చిన్న చిన్న కీటకాల రక్షణపై కూడా వైజ్ఞానిక ప్రపంచం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కానీ ఆస్ట్రేలియా మాత్రం అందుకు విరుద్ధంగా సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా దేశంలోని ప్రధాన వ్యవసాయ పరిశ్రమలలో ఒకటైన తేనె ఉత్పత్తిని రక్షించడానికి ఒక మిలియన్ తేనెటీగలను చంపాలని యోచిస్తోంది.

తేనెటీగల పెంపకాన్ని ఏపికల్చర్ అంటారు. ఏపికల్చర్ ఉనికికి ఆధారం అయినప్పుడు వాటిని చంపడం ద్వారా పరిశ్రమ తేనెటీగలను ఎలా కాపాడుతుంది అనేది తార్కిక ప్రశ్న. వరోవా మైట్ అనే పరాన్నజీవి, తేనెటీగలు, తేనెటీగల పరిశ్రమను తీవ్ర సంక్షోభంలోకి తెచ్చింది. ఉదాహరణకు బర్డ్ ఫ్లూ మన దేశంలో కనిపిస్తే అది ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు బాతులు, కోళ్లను మూకుమ్మడిగా చంపేస్తున్నారు. ఆస్ట్రేలియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వరోవా మైట్ పరాన్నజీవి ఇప్పుడు ఆస్ట్రేలియాలోని ఆగ్నేయ ప్రాంతంలోని తేనెటీగలలో గుర్తించింది. ఈ పరాన్నజీవి సోకిన తేనెటీగలు ఇటీవల సిడ్నీ హార్బర్ సమీపంలోనూ కనుగొనబడ్డాయి. తేనె పరిశ్రమ ఆస్ట్రేలియాలో బహుళ-బిలియన్ డాలర్ల నెలవారీ ఆదాయ పరిశ్రమ. ఈ పరిస్థితిలో పరాన్నజీవి సోకిన తేనెటీగలు ఇతర ప్రాంతాలకు రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

వరోవా పురుగులు ఆవపిండి పరిమాణంలో ఉండే పరాన్నజీవులు. వీటిని వరోరవా డిస్ట్రక్టర్స్ అని కూడా అంటారు. అవి తేనెటీగలపై దాడి చేస్తాయి. ఇది అందులో నివసించే తేనెటీగలపై ఆధిపత్యం చెలాయిస్తుంది. తేనెటీగలపై నెమ్మదిగా దాడి చేసి చంపడం ప్రారంభిస్తుంది. ఇవి తెనే పట్లకు వ్యాపించి తేనెటీగలను నాశనం చేస్తాయి. ఒక రకమైన వైరస్‌ను వ్యాపింపజేస్తాయి. తాజాగా న్యూ సౌత్‌వేల్స్‌లో ఏడు ప్రాంతాల్లో వరోవా జీవులను గుర్తించారు. దీంతో వాటి వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు పలు రకాల బయో సెక్యురిటీ చర్యలను చేపట్టారు. వరోవా సోకిన ప్రాంతాల నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేనెపట్లను నాశనం చేస్తాయి. ఇప్పటివరకు న్యూ సౌత్‌వేల్స్‌లో 400 తేనెపట్లలో ఈ వరోవా జీవులను గుర్తించారు. సాధారణంగా ప్రపంచ దేశాల్లో వరోవా జీవులు ఉన్నా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో మాత్రం గుర్తించలేదు. దీంతో ఇప్పుడు కంగారూ దేశంలో ఆందోళన మొదలయ్యింది. వరోవా వ్యాప్తి చెందితే తేనె, ఆహార ఉత్పత్తి పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే వెంటనే తేనెటీగల రక్షణ కోసం కొత్త బయోసెక్యూరిటీ జోన్‌ను అక్కడి అధికారులు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

వరోవా కీటకాలు పరాన్న జీవులు ఆస్ట్రేలియాలోని మొత్తం తేనెటీగలను నాశనం చేస్తాయని అక్కడి తేనె ఉత్పత్తి పరిశ్రమపై ఆధారపడినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తేనెటీగల లాక్‌డౌన్‌ను అక్కడి అధికారులు ప్రకటించారు. దీంతో తేనెటీగలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించకుండా ఉంటాయి. వరోవా కారణంగా తేనెటీగలకు సోకిన వైరస్‌ మరో ప్రాంతానికి వ్యాపించకుండా అడ్డుకుంటారు. వరోవా వ్యాప్తి చెందితే తేనె ఉత్ప్తి పరిశ్రమ 7 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లుతుంది. మన రూపాయిల్లో చెప్పుకుంటే.. 553 కోట్ల మేర తేనె ఉత్పత్తి పరిశ్రమ నష్టపోతుంది. ఆస్ట్రేలియా ఆహార ఉత్పత్తిలో దాదాపు మూడింట ఒక వంతు తేనెటీగల పరాగసంపర్కంపై ఆధారపడి ఉంటుంది. తేనెటీగలు లేకపోతే బాదం, యాపిల్స్‌, అవకాడో వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అక్కడి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వరోవా పురుగులు తేనెటీగలపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ పరాన్నజీవులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో తేనెటీగల వ్యాపారాన్ని చాలాసార్లు దెబ్బతీశాయి.  అడవులు, ఇతర సహజ ఆవాసాలలో కూడా ఈ పరాన్నజీవులు తేనెటీగలను చంపుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. తేనెటీగలు మానవ మనుగడకు అవసరమైన జీవులు. కానీ వరోవా పురుగు  దాడి చేయడం వల్ల ఈ తేనెటీగల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. వాటి దాడిలో, తేనెటీగలు మొదట తమ శక్తి సామర్థ్యాన్ని కోల్పోతాయి.  తరువాత నడవడానికి, ఎగిరే సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీంతో తేనెటీగలు ఆహారం దొరకక చనిపోతాయి. కాలనీలోని ఇతర తేనెటీగలలో కూడా ఇదే పరిస్థితి త్వరలో కనిపిస్తుంది. దీంతో ఈ పరాన్నజీవుల దాడికి ఒక్కో గూడు పూర్తి పరిశ్రమనే నాశనమవుతుంది. చివరకు పెద్ద తేనెటీగల నుండి గుడ్ల వరకు ప్రతిదానిపై దాడి చేయవచ్చు.

ఆస్ట్రేలియా మొత్తం తేనె ఉత్పత్తి రంగంలో సగం వరకు న్యూ సౌత్‌వేల్స్‌లోనే ఉంటుంది. ఇక్కడ సుమారు 600కు పైగా తేనెటీగల పరిశ్రమలకు ఉన్నాయి. సుమారు 60 లక్షల మేర తేనెటీగలు పెంచుతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వరోవా కీటకాల రాకతో తేనెటీగలు వైరస్‌ బారిన పడి చనిపోతున్నాయి. తేనె పట్టులకు కూడా వైరస్‌ సోకి ఉంటుందని అక్కడి వ్యాపారులు నిప్పు పెడుతున్నారు. వరోవా కారణంగా తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో నష్టపోయామని ఈసారి వరోవా కీటకాల రాకతో తమకు అప్పులే మిగులుతాయని వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని తేనె ఉత్పత్తుల వ్యాపారులు కోరుతున్నారు. తేనెటీగలను రక్షించుకునేందుకు అస్ట్రేలియా ప్రభుత్వం తేనెటీగల లాక్‌డౌన్‌ను ప్రకటించింది. వరోవా కీటకాలను గుర్తించిన చోట తేనెటీగలను ఆస్ట్రేలియా ప్రభుత్వం చంపేస్తోంది. తేనె ఉత్పత్తుల పరిశ్రమను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.