England: చుక్కలు చూపిస్తున్న స్లో డ్రైవింగ్.. స్పీడ్ గా వెళ్లాలని చెప్పినా వినట్లే.. అసలు సంగతేంటంటే

అవి సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు. కానీ వెహికిల్స్‌ మాత్రం కావాలని స్లో అయిపోయాయి. ఎందుకంటే అక్కడి ప్రజలు పెట్రోల్‌ ధరల పెంపుపై వినూత్న నిరసన చేపట్టారు మరి. ఇంగ్లండ్‌లో ప్రధాన మార్గాలపై ఎప్పుడూ దూసుకుపోయే వాహనాలు అతి నెమ్మదైపోయాయి....

England: చుక్కలు చూపిస్తున్న స్లో డ్రైవింగ్.. స్పీడ్ గా వెళ్లాలని చెప్పినా వినట్లే.. అసలు సంగతేంటంటే
Slow Driving Protest In Eng
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: Jul 05, 2022 | 7:30 AM

అవి సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు. కానీ వెహికిల్స్‌ మాత్రం కావాలని స్లో అయిపోయాయి. ఎందుకంటే అక్కడి ప్రజలు పెట్రోల్‌ ధరల పెంపుపై వినూత్న నిరసన చేపట్టారు మరి. ఇంగ్లండ్‌లో ప్రధాన మార్గాలపై ఎప్పుడూ దూసుకుపోయే వాహనాలు అతి నెమ్మదైపోయాయి. చుక్కలు చూపిస్తున్న పెట్రోల్‌ ధరలపై చాలామంది స్లో డ్రైవింగ్‌ (Slow Driving) తో నిరసన తెలిపారు. స్లో డ్రైవింగ్‌ ప్రభావం ఇంగ్లండ్‌ (England), వేల్స్‌ను కలిపే M4 రోడ్‌పై బాగా కనిపించింది. ఈ మార్గంలో భాగంగానే ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ బ్రిడ్జి ఉంది. దీనిపై నిబంధనలకు విరుద్ధంగా గంటకు 48 కిలో మీటర్ల కంటే తక్కువ స్పీడ్‌తో వాహనాలు నడిపినందుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 12 మంది వాహనాదారులను అరెస్ట్‌ చేశారు. పెట్రోల్‌ ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహనాదారులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే పెట్రోల్‌ ధరల పెరుగుదల నెపాన్ని రష్యా మీదకి నెట్టేస్తోంది ఇంగ్లండ్‌ ప్రభుత్వం. ఇంధన పన్నును ఇప్పటికే ఒకసారి తగ్గించామని, ప్రజలకు ఫైనాన్షియల్‌ సపోర్ట్‌ ఇస్తున్నామని సమర్థించుకుంటోంది.

కాగా పెట్రోల్ ధరల పెరుగుదలతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించాయి. అలాంటి ఉద్యోగులందరూ స్లో డ్రైవింగ్‌ నిరసనలో పాల్గొన్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఈ నిరసనకు ప్రచారం కల్పించారు. దీంతో వందలాది మంది ప్రధాన మార్గాల్లో స్లో డ్రైవింగ్‌కు దిగారు. దీంతో ఎప్పుడూ వాహనాలు వేగంగా దూసుకుపోయే హైవేలపై నత్తనడక నడుస్తున్నట్టు కనిపించాయి. పోలీసులు వారిని ఫాలో అవుతూ స్పీడ్‌గా వెళ్లాలని చెప్పినా నిరసనకారులు పట్టించుకోలేదు. ఇంధన ధరలు తగ్గించే వరకు నిరసన కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ ను తీర్చాల్సిందేనని పట్టుబడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?