AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkaiah Naidu: శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే స్వామివారిని దర్శించుకోవాలని భక్తులకు వినతి..

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu)  తిరుమల శ్రీవారిని ( Tirumala Srivari Temple) దర్శించుకున్నారు. గురువారం ఉదయం ప్రాతఃకాల సమయంలో కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు

Venkaiah Naidu: శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే స్వామివారిని దర్శించుకోవాలని భక్తులకు వినతి..
Venkaiah Naidu
Basha Shek
|

Updated on: Feb 10, 2022 | 8:49 AM

Share

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu)  తిరుమల శ్రీవారిని ( Tirumala Srivari Temple) దర్శించుకున్నారు. గురువారం ఉదయం ప్రాతఃకాల సమయంలో కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ‘ శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. స్వామి దర్శనంతో లభించిన సంతృప్తి, సంతోషంతో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం లభిస్తుందని భావిస్తున్నాను. తిరుమలకు ఎన్నిసార్లు వచ్చినా నిత్య నూతన ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ శ్రీవారిని దర్శించుకోండి. హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఆలయంలో టీటీడీ ఏర్పాట్లు బాగున్నాయి. భక్తులు సంవత్సరంలో ఒకసారి మాత్రమే స్వామివారిని దర్శించుకోండి. దీని వల్ల అందరికీ స్వామి దర్శన భాగ్యం లభిస్తోంది’ అని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు.

నేడు మనవరాలి వివాహం..

కాగా ఉపరాష్ట్రపతి మనవరాలు సుష్మ నేడు (ఫిబ్రవరి10) పెళ్లిపీటలెక్కనుంది. పుష్పగిరి మఠంలో నిరాడంబరంగా ఈ వివాహం జరగనుంది. అందుకే పెళ్లి ముందే కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా నిన్న తిరుపతికి చేరుకున్న వెంకయ్యనాయుడుకు మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు, ఇతరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన భవనంలోకి తీసుకెళ్లారు. కాగా వెంకయ్య నాయుడు మనవరాలి వివాహం సందర్భంగా వివాహ వేదిక పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

Also Read:Bangarraju: ఓటీటీలోకి అడుగుపెట్టనున్న బంగార్రాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. Aadavallu Meeku Johaarlu: భారీ ధరకు శర్వానంద్ సినిమా థియేట్రికల్ రైట్స్.. కుర్రహీరో కెరీర్‌లోనే అతిపెద్ద డీల్

UnstoppableWith NBK: మెగాస్టార్‌ ఎపిసోడ్‌ ఉండుంటే అన్‌స్టాపబుల్‌ మరో లెవెల్లో ఉండేది.. టాక్‌ షో డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..