AP Official Translator: అంతర్జాతీయ భాషలలో మన సత్తా చూపిన తెలుగు రచయిత
ఫ్రాన్స్ తునిసియా జింబాబ్వేలతో పాటూ ఇతర దేశాల నుంచి ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో సహజ వ్యవసాయం ద్వారా వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను పరిశీలించేందుకు భారతదేశానికి వచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతులతో సంభాషిచే సమయంలో అటు ఫ్రెంచ్ వారికి ఇటు తెలుగు వారికి వారధిగా నిలిచారు పూలబాల. ఈయన ఫ్రెంచ్ను తెలుగులోకి.. తెలుగును ఫ్రెంచ్‌లోకి అనువదించడానికి ప్రభుత్వ అనువాదకుడిగా తన సేవలు అందించారు.

ఫ్రాన్స్ తునిసియా జింబాబ్వేలతో పాటూ ఇతర దేశాల నుంచి ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో సహజ వ్యవసాయం ద్వారా వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను పరిశీలించేందుకు భారతదేశానికి వచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతులతో సంభాషిచే సమయంలో అటు ఫ్రెంచ్ వారికి ఇటు తెలుగు వారికి వారధిగా నిలిచారు పూలబాల. ఈయన ఫ్రెంచ్ను తెలుగులోకి.. తెలుగును ఫ్రెంచ్‌లోకి అనువదించడానికి ప్రభుత్వ అనువాదకుడిగా తన సేవలు అందించారు. అగ్రి కల్చర్ రీసెర్చ్ మీద సరికొత్త విషయాలను తెలియజేయడానికి బెంగళూరులో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు. అక్కడ కూడా తన భాష నైపుణ్యాలతో సేవలందించారు.
ఫ్రెంచ్‌లో నవల రాసిన తెలుగు రచయత వెంకట్ పూలబాల. దూరదర్శన్‌లో కెరీర్ అవకాశాల గురించి తెలియజేసే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను రూపొందించారు. సాహిత్య ప్రహేళిక వంటి రచనావ్యాసంగం ద్వారా ఆల్ ఇండియా రేడియోలో హాస్య నాటికలను చెప్పడంలో సుపరిచితులు. ఒక్క ఫ్రెంచ్‌లోనే కాక ఆరు విదేశీభాషలతో అత్యధికంగా పుస్తకాలు రచించిన ఎక్స్ ఫోనిక్ రైటర్‌గా పేరుతెచ్చుకున్నారు. ఈయన సాహిత్య ప్రస్థానం రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పేదాకా సాగింది. తెలుగు మధ్య తగరతి కుటుంబంలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకున్న పూలబాల అవిరళ కృషితో 6 విదేశీభాషలలో తడుము కోకుండా మాట్లాడ్డమే కాకుండా వాటిని బోధిస్తూ అనువాదకుడిగా రాణించారు. అలాటే అనేక గ్రామీణ పాఠశాలలలో విద్యార్థులకు ఉచిత శిక్షణను అందిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు.
హైటెక్ సిటీలోని ఒక ఫ్రెంచ్ కంపెనీలో అనువాదకుడిగా చేస్తున్న పనివదిలిపెట్టి భాషా బోధనా పట్ల మక్కువతో విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న ఈజీ ఫారిన్ లాంగ్వేజస్ (EFL) అనే సంస్థ ను స్థాపించి 14 సంవత్సరాలుగా ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, జపనీస్తో పాటు ఇంగ్లీష్ కలిపి మొత్తం ఆరు విదేశీభాషలను భోధించారు. పూలబాల ఇండో ఫ్రెంచ్ కల్చరల్ అకాడమీ స్థాపించి కల్చరల్ అకాడమీ ద్వారా చిన్నపిల్లలకు ఉచితంగా ఫ్రెంచ్ డ్రామా, పాటలు వంటి సాంస్కృతిక కార్య క్రమాల్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన 3 వతరగతి నుంచి 10 వ తరగతి వరకూ చదువుతున్న బాల బాలికలు పలు రేడియో కార్యక్రమాలు వినిపిస్తున్నారు. జూన్ 25 వ తేదీన 2017 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన కార్యక్రమాన్ని యు ట్యూబ్‌లో మల్టీ లింగ్వల్ కిడ్స్ అని టైపు చేసి చూడవచ్చు. భీమవరం నుంచి మరో రెండు రేడియో కార్యక్రమాలలో కూడా విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ ( APCNF) చైర్మన్ సీనియర్ ఐ. ఏ. ఎస్. ఆఫీసర్ విజయకుమార్ చేత అధికార అనువాదకుడిగా నియమించబడ్డారు. ఆ తరువాత పూలబాల చేసిన కృషి క్రమంగా వెలుగులోకి వస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




