YS Jagan: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేన అభ్యర్థులకు రాలేదు.. చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు
ఎత్తులు, పొత్తులు, కుయుక్తులపై చంద్రబాబు ఆధారపడతారని, దత్తపుత్రుడిని పక్కన పెట్టుకొని డ్రామాలు ఆడతారని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. మాట మీద నిలబడిన చరిత్ర చంద్రబాబుకు లేదని ఫైర్ అయ్యారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ - చంద్రబాబు భాగస్వామి అంటూ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపిన పవన్ కల్యాణ్.. అక్కడ మాట్లాడిన మాటలను జగన్ ప్రస్తావించారు. తెలంగాణలో పోటీ చేసిన పవన్ కల్యాణ్ పార్టీకి బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదన్నారు.

ఎత్తులు, పొత్తులు, కుయుక్తులపై చంద్రబాబు ఆధారపడతారని, దత్తపుత్రుడిని పక్కన పెట్టుకొని డ్రామాలు ఆడతారని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. మాట మీద నిలబడిన చరిత్ర చంద్రబాబుకు లేదని ఫైర్ అయ్యారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ – చంద్రబాబు భాగస్వామి అంటూ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపిన పవన్ కల్యాణ్.. అక్కడ మాట్లాడిన మాటలను జగన్ ప్రస్తావించారు. తెలంగాణలో పోటీ చేసిన పవన్ కల్యాణ్ పార్టీకి బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదన్నారు. తెలంగాణలో జనసేనకు డిపాజిట్లు కూడా దక్కలేదంటూ జగన్ విమర్శించారు. గురువారం వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. వైయస్సార్ సుజలధార ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం అనంతరం కాశీబుగ్గ బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పలు ఈ వ్యాఖ్యలు చేశారు. దేవుడి దయతో ఈరోజు రెండు మంచి గొప్ప కార్యక్రమాలు జరిగాయని, ఇవి అందరికీ ఉపయోగపడతాయని.. జగన్ పేర్కొ్న్నారు. మామూలుగా ఉద్దానం అనే ఈ ప్రాంతాన్ని పిలుస్తుంటారని.. ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్ధమన్నారు. ఈ పచ్చటి ప్రాంతంలోని ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు మహమ్మారిలా కాటేశాయని.. దాని వల్ల అనేక కుటుంబాలు, వాళ్ల జీవితాలు అల్లకల్లోలమయ్యాయన్నారు. 2018, డిసెంబర్ 30న ఇదే పలాసలో బహిరంగ సభలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పానని.. దానిని పూర్తిచేసినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఇక్కడికి కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పని చేయబోతోందని జగన్ వివరించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి తన సొంత నియోజకవర్గం కుప్పానికి గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే లేదన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్నే పట్టించుకోని ఈ వ్యక్తికి ఉత్తరాంధ్రపై ఏం ప్రేమ ఉంటుంది..? అంటూ మండిపడ్డారు. ఎన్నికలు వచ్చే సరికే పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద ఆధారపడతారని.. దత్తపుత్రుడిగా యాక్టర్ ను పెట్టుకొని డ్రామాలు ఆడతారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో జనసేన పోటీపై కూడా జగన్ మాట్లాడారు.. పవన్ అభ్యర్థులను నిలబెడుతూ, తెలంగాణలో అన్నమాటలు వింటే ఆశ్చర్యం అనిపించిందన్నారు.
తెలంగాణలో తాను పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నానంటారు.. తన దురదృష్టం అంటారు.. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. ఈ పెద్దమనిషి చంద్రబాబుకు ఇంకొక పార్టనర్ అంటూ ఫైర్ అయ్యారు. చివరికి ఇండిపెండెంట్గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదని.. డిపాజిట్లు కూడా రాలేదంటూ విమర్శించారు. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు, మోసాలు ఎక్కువ అవుతాయని.. ఎవరు మాట ఇచ్చారు. మాట మీద నిలబడింది ఎవరు అనేది కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని ప్రజలను వైఎస్ జగన్ కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
