AP News: వింత జాతర.. అక్కడ పూజారులే దేవుళ్లు.. తొక్కితే కష్టాలన్నీ హుష్‌కాకి.!

కాలితో తొక్కించుకుంటే కష్టాలు పోతాయట.. అవును.! ఆ గ్రామ ప్రజలంతా నమ్మకం అదే. అందుకే ప్రతి ఏటా.. అక్కడ వైభవంగా జాతర నిర్వహిస్తారు. విగ్రహాలు పట్టుకున్న పూజారులు వారిపై నుంచి తొక్కుకుని వెళ్లేలా బోర్లా పడుకుంటారు. వారి కాలి స్పర్శ కోసం అక్కడ ప్రజలు ఆరాటపడతారు. మత్స్యకార గ్రామంలో జరిగే ఆ వింత జాతర విశేషాలు ఏంటో తెలుసుకుందామా.?

AP News: వింత జాతర.. అక్కడ పూజారులే దేవుళ్లు.. తొక్కితే కష్టాలన్నీ హుష్‌కాకి.!
Anakapalli Thokkudu Jatara
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 19, 2024 | 4:31 PM

కాలితో తొక్కించుకుంటే కష్టాలు పోతాయట.. అవును.! ఆ గ్రామ ప్రజలంతా నమ్మకం అదే. అందుకే ప్రతి ఏటా.. అక్కడ వైభవంగా జాతర నిర్వహిస్తారు. విగ్రహాలు పట్టుకున్న పూజారులు వారిపై నుంచి తొక్కుకుని వెళ్లేలా బోర్లా పడుకుంటారు. వారి కాలి స్పర్శ కోసం అక్కడ ప్రజలు ఆరాటపడతారు. మత్స్యకార గ్రామంలో జరిగే ఆ వింత జాతర విశేషాలు ఏంటో తెలుసుకుందామా.?

విభిన్న సంస్కృతుల సమ్మేళనం మన భారతదేశం. ఆచారాలు, సాంప్రదాయాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. దేశంలో పండుగలు జాతరగా కూడా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా విభిన్నంగా నిర్వహిస్తూ ఉంటారు. వేర్వేరు చోట్ల రకరకాల జాతరలు కూడా జరుగుతుంటాయి. వీటిలో కొన్ని వింతగా ఉంటాయి. కానీ అవి స్థానికులకు మాత్రం ప్రత్యేకమైనవి. అత్యంత భక్తి శ్రద్ధలతో జాతరలు నిర్వహిస్తూ.. మొక్కులు చెల్లించుకుంటూ సందడిగా సంబరాలు చేసుకుంటారు. ఇలా వింతగా అనిపించే జాతరలో నూకతాత జాతర ఒకటి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని మత్యకార గ్రామమైన రాజయ్యపేటలో ఈ జాతరను ఏటా వైభవంగా నిర్వహిస్తారు . దీనినే తొక్కుడు జాతర అని కూడా అంటారు. ఏటా శివరాత్రి మర్నాడు ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు స్థానికులు

ఆ కాలి స్పర్శ తగిలితే..

అనాదిగా.. రాజయ్యపేట ప్రాంత మత్స్యకారులు నూకతాతను కులదైవంగా ఆరాధిస్తున్నారు. గ్రామంలో నూక తాతకు ప్రత్యేకంగా ఆలయం కూడా నిర్మించారు. శివరాత్రి మరుసటి రోజు విగ్రహాలను సముద్రస్నానానికి తీసుకువెళ్తారు. సముద్ర తీరంలో పుణ్య స్నానం అనంతరం విగ్రహలను పూజారులు తీసుకువస్తారు. ఈ క్రమంలో వేలాదిమంది ప్రజలు రోడ్డుపై పడుకుంటారు. వారిని తొక్కుకుంటూ పూజారులు విగ్రహాలు పట్టుకుని వెళ్లడం ఆనవాయితీ. అలా చేస్తే ఆ ఏడాది అంతా తమ కష్టాలు గట్టెక్కుతాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. ఇలా తొక్కించుకునేందుకు స్థానిక జనం పోటీపడతారు. బోర్లా పడుకుని.. ఆ కాలు స్పర్శ తగిలితే చాలు అన్నట్టుగా భక్తి భావంతో ఉంటారు. ఇదీ అనకాపల్లి జిల్లా మత్స్యకార గ్రామం రాజపేట లో జరిగే నూతన జాతర సందడి. మీరు ఆ జాతర విశేషాలు స్వయంగా చూడాలంటే శివరాత్రి మరుసటి రోజు అక్కడికి వెళ్లాల్సిందే.

Anakapalli Jatara