Important Exam Dates 2024: ఏపీ, తెలంగాణలో వచ్చే 3 నెలల్లో జరిగే ముఖ్యమైన పరీక్షలు, ఫలితాల తేదీలు ఇవే.. ఏ రోజు ఏ పరీక్షంటే
వచ్చే మూడు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలే.. పరీక్షలు. పోటీపరీక్షలు ఓ వైపు.. అకడమిక్ పరీక్షలు మరోవైపు. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తికాగా.. రెండు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు జరగనుండగా.. అటు తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరిగిన ఏపీ ఇంటర్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే..
వచ్చే మూడు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలే.. పరీక్షలు. పోటీపరీక్షలు ఓ వైపు.. అకడమిక్ పరీక్షలు మరోవైపు. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తికాగా.. రెండు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు జరగనుండగా.. అటు తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరిగిన ఏపీ ఇంటర్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అటు తెలంగాణలోనూ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్ పరీక్షల మూల్యాంకనం మొత్తం 4 దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి విడత కింద ఆంగ్లం, తెలుగు, హిందీ, గణితం, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను మార్చి 16తో మూల్యాంకనం పూర్తి చేశారు. మార్చి 20 నుంచి రెండో విడతలో ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులను మూల్యాంకనం చేస్తారు. మార్చి 22 నుంచి మూడో విడతలలో కెమిస్ట్రీ, కామర్స్‌తను, మార్చి 24 నుంచి నాలుగో విడతలో చరిత్ర, బోటనీ, జువాలజీ జవాబు పత్రాలు మూల్యాకనం చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. మూల్యాంకన ప్రక్రియ పూర్తైతే ఆ వెనువెంటనే ఫలితాలు కూడా ప్రకటించనున్నారు. ఇక ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటికే ఆయా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏ రోజున ఏయే పరీక్ష ఉంటుందో ఆ వివరాలు మీకోసం..
రానున్న 3 నెలల్లో జరిగే ముఖ్యమైన పరీక్షలు, ఫలితాల తేదీలు ఇక్కడ తెలుసుకోండి..
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ముఖ్యమైన పరీక్షలు ఇవే..
- ఏపీ పదో తరగతి 2024 ఫలితాలు: మే 2వ వారం
- ఏపీ ఇంటర్ 2024 ఫలితాలు: ఏప్రిల్ చివరిలో
- ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షలు: మే 13 నుంచి19 వరకు
- ఏపీ డీఎస్సీ 2024 పరీక్షలు: మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు
తెలంగాణలో జరిగే ముఖ్యమైన పరీక్షలు ఇవే..
- తెలంగాణ పదో తరగతి 2024 ఫలితాలు: మే 2వ వారం
- తెలంగాణ ఇంటర్ 2024 ఫలితాలు: ఏప్రిల్ చివరిలో
- తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షలు: జులై 17 నుంచి 31 వరకు
- తెలంగాణ టెట్ 2024 పరీక్షలు: మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు
- టీఎస్సీయస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్ 9, 2024.
- టీఎస్సీయస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ: అక్టోబర్ 21, 2024.
- తెలంగాణ ఈఏపీసెట్ 2024 పరీక్ష తేదీలు: మే 9 నుంచి 12 వరకు
- తెలంగాణ RDC CET-2024 పరీక్ష: ఏప్రిల్ 28, 2024.
- తెలంగాణ పీజీఈసెట్ – 2024 పరీక్ష తేదీ: జూన్ 6 నుంచి జూన్ 9 వరకు, 2024.
- తెలంగాణ ఐసెట్-2024 పరీక్ష తేదీ: జూన్ 4, 5 తేదీల్లో, 2024
- తెలంగాణ లా సెట్-2024 పరీక్ష తేదీ: జూన్ 3, 2024
అఖిల భారత ప్రవేశ పరీక్షల తేదీలు
- సీయూఈటీ (యూజీ) – 2024 ప్రవేశ పరీక్ష: మే 15 నుంచి 31 వరకు, 2024.
- నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాల తేదీ: జూన్ 14, 2024
తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ఇచ్చే అవకాశం ఉంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.