Andhra Pradesh: రైలు సీటు కింద కనిపించిన బ్యాగ్.. ఏంటోనని చెక్ చేయగా.. దెబ్బకు హడల్..
Tirupati News: S-6 కోచ్ లో పర్పుల్ కలర్ ట్రాలీ బ్యాగ్ లో ఉన్న పూడు పామును గుర్తించిన ప్రయాణికులు రేణిగుంట వద్ద టిసికి సమాచారం ఇచ్చారు. ఆ సీట్లో ఎవరూ లేకపోగా బ్యాగ్ మాత్రమే ఉండడంతో అనుమానం వచ్చింది.
Tirupati News: రెండు తలల పాము.. పూడుపాము.. ఒకప్పుడు తెగ ఫేమస్.. చాలామంది వాటిని స్మగ్లింగ్ చేస్తుంటారు. అయితే, కొంతకాలం నుంచి వీటి స్మగ్లింగ్ జరగడం లేదు.. కానీ మళ్లీ పూడు పాము స్మగ్లింగ్ మొదలైంది. అది కూడా రైళ్లలో గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా.. తిరుపతి జిల్లాలో పూడు పాముల స్మగ్లింగ్ మళ్లీ తెరపైకి వచ్చింది. పూడు పాముల స్మగ్లింగ్ తిరిగి షురూ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో పూడు పాముల అక్రమ రవాణా పెద్ద బిజినెస్ గానే కర్ణాటక – తమిళనాడు సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలో సాగిందన్న ప్రచారానికి ఈ మధ్య తెరపడిందనుకున్నారు.
కానీ, ఈ మధ్య కాలంలో పూడు పాముల స్మగ్లింగ్ ముఠాల కదలికలు కూడా లేవు. అయితే ఇప్పుడు ఏకంగా రైళ్లలో డైరెక్టర్ ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న స్మగ్లర్లు స్నేక్ బిజినెస్ కొనసాగిస్తున్నట్లు బయట పడింది. ముంబై చెన్నై లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైల్ లో పూడుపూమును అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రయాణికులు గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
S-6 కోచ్ లో పర్పుల్ కలర్ ట్రాలీ బ్యాగ్ లో ఉన్న పూడు పామును గుర్తించిన ప్రయాణికులు రేణిగుంట వద్ద టిసికి సమాచారం ఇచ్చారు. ఆ సీట్లో ఎవరూ లేకపోగా బ్యాగ్ మాత్రమే ఉండడంతో అనుమానం వచ్చింది. దీంతో పుత్తూరు రైల్వే పోలీసులను అప్రమత్తం చేసిన టిసి.. ఫారెస్ట్ సిబ్బందిని పిలిపించి పాము ఉన్న బ్యాగ్ ను అప్పగించారు.
అనంతరం పూడుపామును వడమాల పేట సదాశివకోన ఫారెస్ట్ లో వదిలి పెట్టినట్లు అటవీ శాఖ సిబ్బంది వెల్లడించారు. చాలా రోజుల తర్వాత పూడు పాము స్మగ్లింగ్ తెరపైకి రావడంతో పోలీసులు మళ్లీ అప్రమత్తమయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..