Compensation: ఎన్నాళ్లుగానో తమకు రావలసిన GSPC, ONGC సంస్థ ద్వారా నష్ట పరిహారం కోసం ఎదురుచూస్తూ ఉన్న తమకు TV9 చొరవతో నష్ట పరిహారం దక్కిందని యానాంకు చెందిన మత్సకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటాన్ని TV9లో చూపడంతో చమురు సంస్థలు దిగివచ్చి పరిహారాన్ని అందచేసాయని వారు కృతజ్ఞతలు తెలియచేసారు.
యానాం సముద్ర తీర ప్రాంతంలో 2015-16 వ సంవత్సరంలో చమురు కంపెనీ జి.ఎస్.పి.సి చమురు వెలికితీత కార్యకలాపాలను చేపట్టింది. ఈ కార్యకలాపాల వల్ల స్థానిక మత్సకారులకు జీవనోపాధి అయిన చేపల వేటకు అంతరాయం కలిగింది. దీంతో జి.ఎస్.పి.సి సంస్థ మత్సకారులతో ఒప్పందం చేసుకుంది. కానీ ఒప్పందం చేసుకున్న పరిహారం సొమ్మును ఇంతవరకూ అందచేయలేదు. కాలక్రమేణా జి.ఎస్.పి.సి సంస్థ ఓ.ఎన్.జి.లో విలీనం అయ్యింది. ప్రస్తుతం ఓ.ఎస్.జి.సి సంస్థ యానాం పరిసర ప్రాంతంలో సముద్రంలో తన కార్యకలాపాలను మొదలుపెట్టడంతో మత్సకారులు ఆపనులను అడ్డుకున్నారు. వారికి అండగా TV9 నిలిచింది. గత సంవత్సరం నవంబరు నెలలో 9వ తేదీన, 20వ తేదీన ప్రత్యేక కథనాలను ప్రసారం చేయడంతో ఓ.ఎన్.జి.సి అధికారులు స్పందించారు.
తాజాగా మత్సకారులకు 3,354 మందికి రావలసిన నష్టపరిహారం బకాయి రూ.16.38 కోట్లను మత్స్యశాఖ చీఫ్ సెక్రెటరీ మత్సశాఖ సొసైటీకి జమ చేశారు. దాంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. కేవలం TV9 ప్రసారం చేసిన కథనాల వలన తమకు పరిహారం సొమ్ములు ఇంత వేగంగా అందాయని మత్స్యకారులు TV9 కు కృతజ్ఞతలు తెలిపారు.
యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ మాట్లాడుతూ.. తాను గత ఎన్నికలలో మత్సకారులకు పరిహారం సత్వరమే అందేలా చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని అన్నారు. తొందరలోనే వారి వారి వ్యక్తిగత ఖాతాలలో సొమ్ములు జమ అవుతాయని అన్నారు. నష్ట పరిహారం సొమ్మును ఇతర అవసరాలకు ఇవ్వాలని ఎవ్వరైనా అడిగితే వారిపై కట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎమ్మెల్యే అశోక్.
పుదుచ్చేరి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి వర్గీయులు మట్లాడుతూ.. ఇది కేవలం మల్లాడి కృషితోనే సాద్యం అయిందన్నారు. మల్లాడి నిరంతరం పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, చమురు సంస్థలతో మాట్లాడి పరిహారం నిధులు మంజూరు అయ్యేందుకు కృషి చేశారని అన్నారు. నష్ట పరిహారం కోసం మత్స్యకారులు జరిపిన పోరుని ప్రత్యేక కథనాలద్వారా ప్రసారం చేసిన TV9 కు రెండు వర్గాల మత్స్యకార సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Also read:
ఇంటికి రానని మొండికేసిన సింహం !! బలవంతంగా ఎత్తుకెళ్లిన మహిళ !! వీడియో
Telangana News: ఏడుగురు సభ్యుల దొంగల ముఠా.. చేసేవన్నీ అలాంటి చోరీలే.. షాకింగ్ వివరాలు మీకోసం..!