AP Corona Virus: రుయా ఆస్పత్రిలో 130 మందికి కరోనా.. ఇతర జిల్లా వైద్యులను డిప్యూట్ చేస్తామంటున్న డాక్టర్ భారతి..

AP Corona Virus: కరోనా వైరస్ (Corona Virus)అదుపులోకి వచ్చింది అనుకున్న సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) వెలుగులోకి వచ్చింది. ఓ వైపు మళ్ళీ కరోనా వైరస్ కేసులు భారీగా..

AP Corona Virus: రుయా ఆస్పత్రిలో 130 మందికి కరోనా.. ఇతర జిల్లా వైద్యులను డిప్యూట్ చేస్తామంటున్న డాక్టర్ భారతి..
Coronas Virus
Follow us
Surya Kala

|

Updated on: Jan 20, 2022 | 2:25 PM

AP Corona Virus: కరోనా వైరస్ (Corona Virus)అదుపులోకి వచ్చింది అనుకున్న సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) వెలుగులోకి వచ్చింది. ఓ వైపు మళ్ళీ కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు నమోదవుతూ ఆందోళన కలిస్తున్నాయి. అయితే కరోనా బాధితులకు చికిత్సనందిస్తూ.. వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ఇప్పుడు కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా తిరుపతిలో కరోనా మహమ్మారి ఓ రేంజ్ లో విజృంభిస్తోంది. దీంతో ఆసుపత్రులు పడకేసాయి. వివరాల్లోకి వెళ్తే..

తిరుపతి స్విమ్స్,  రుయా ఆసుపత్రిలోని భారీ గా వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది వందలాది మంది కరోనా బాధితులుగా మారారు. స్విమ్స్ లో 200 మందికి పైగా పాజిటివ్ గా నిర్ధారణ కాగా.. రుయా ఆసుపత్రిలో 120 మందికి కోవిడ్ సోకినట్లు తెలుస్తోంది. భారీగా వైద్య సిబ్బంది కరోనా బారిన పడటంతో.. ఇతర జిల్లాల నుంచి తిరుపతి ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్య సేవలు భారంగా మారాయి. దీంతో రోజులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లకు కరోనా సోకడంతో రుయా ఆసుపత్రిలో తాత్కాలికంగా ఆపరేషన్లకు విరామం ఇచ్చారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య ఇబ్బంది సమన్వయంతో వైద్య సేవలను కొనసాగిస్తున్నారు.

ఇదే విషయంపై  తిరుపతి రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి టీవీ9 తో మాట్లాడుతూ రుయా ఆసుపత్రిలో 130 మందికి పైగా సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారని చెప్పారు. అంతేకాదు రుయా ఆసుపత్రిలో డాక్టర్ల నుంచి అన్ని విభాగాల వారు కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం విద్యుల కోరతాస్ ఏర్పడింది. దీంతో వైద్యం చేయడానికి ఇబ్బంది ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి వైద్య సేవలు అందించడం కష్టంగా మారిందని డాక్టర్ భారతి చెప్పారు. మరింత అవసరమైతే ఎస్వీ మెడికల్ కాలేజీ నుంచి జిల్లాలోని ఇతర వైద్య సిబ్బందిని డిప్యూట్ చేసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అత్యవసర శస్త్ర చికిత్సలు మాత్రమే చేస్తున్నామని డాక్టర్ భారతి టివీ 9 తో చెప్పారు.

Also Read:

ఈ ఫోటో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే.. మీ కళ్లలో పదునున్నట్లే.!

 ఏపీలో అక్కడ ఒక్కసారిగా పడిపోయిన టమాట ధర.. ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు..