Viral Photo: ఈ ఫోటో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే.. మీ కళ్లలో పదునున్నట్లే.!

Viral Photo: సోషల్ మీడియా(Social Media)లో ఎంటర్టైన్మెంట్‌కు కొదవలేదు. ఎన్నో చిత్ర విచిత్రమైన ఫోటోలు, వైరల్ వీడియోలు(Viral Videos) తరచూ చక్కర్లు కొడుతుంటాయి.

Viral Photo: ఈ ఫోటో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే.. మీ కళ్లలో పదునున్నట్లే.!
Find Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 20, 2022 | 9:37 AM

సోషల్ మీడియా(Social Media)లో ఎంటర్టైన్మెంట్‌కు కొదవలేదు. ఎన్నో చిత్ర విచిత్రమైన ఫోటోలు, వైరల్ వీడియోలు(Viral Videos) తరచూ చక్కర్లు కొడుతుంటాయి. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్ సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ ఫోటో పజిల్స్(Photo Puzzles) మన మెదడుకు మేత వేయడమే కాదు.. కళ్లకు కావల్సినంత పదును కూడా పెడతాయి. ఇక పజిల్స్‌ విషయానికొస్తే.. పద సంపత్తి మనలో చురుకుదనాన్ని ఆసక్తిని పెంపొందిస్తే.. ఫోటో పజిల్స్ మేధాశక్తిని పెంచుతాయి. మనకు ఏదైనా ఫోటో పజిల్ కనిపిస్తే చాలు..కళ్లకు పదునుపెట్టి.. వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా అందులో ఏముందో కనిపెట్టకుండా వదిలిపెట్టం. సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ కంటూ ప్రత్యేక పేజీలు  ఉన్నాయి. కొన్నిసార్లు పాత ఫోటో పజిల్స్ సైతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఫోటో పజిల్స్ సాల్వ్ చేయాలంటే కచ్చితంగా మీ కళ్లకు పదునుండాల్సిందే.. ఉంటే మీరు క్షణాల్లో కనిపెట్టేయగలరు. ఈ కోవలో తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read: స్కూటీతో స్టంట్స్ చేయాలనుకుంది.. బెడిసికొట్టి బొక్కబోర్లా పడింది.. వైరల్ వీడియో మీకోసమే!

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి ఓ అటవీ ప్రాంతంలో కనిపిస్తున్న ఆ చోట ఎవరో తమ కుక్కను తీసుకొచ్చినట్లు ఉంది కదూ.. అలాగే ఎక్కడ చూసిన కుప్పలు తెప్పలుగా నేలపై ఎండి ఆకులు ఉన్నాయి. ఇక వీటి మధ్య ఓ విషసర్పం నక్కి ఉంది. దాన్ని గుర్తించేందుకు నెటిజన్లు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్‌కే పామును కనిపెట్టేయగా.. మరికొందరు పూర్తిగా ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.

Also Read: పారాసెటమాల్ టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి!