Viral Video: స్కూటీతో స్టంట్స్ చేయాలనుకుంది.. బెడిసికొట్టి బొక్కబోర్లా పడింది.. వైరల్ వీడియో మీకోసమే!

Bike Stunt Viral Video: సోషల్ మీడియా(Social Media) ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్‌కు కొదవలేదు. ఎన్నో రకాల వీడియోలు(Viral Videos) తరచూ వైరల్ అవుతుంటాయి.

Viral Video: స్కూటీతో స్టంట్స్ చేయాలనుకుంది.. బెడిసికొట్టి బొక్కబోర్లా పడింది.. వైరల్ వీడియో మీకోసమే!
Stunts
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 20, 2022 | 8:46 AM

సోషల్ మీడియా(Social Media) ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్‌కు కొదవలేదు. ఎన్నో రకాల వీడియోలు(Viral Videos) తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. స్టంట్స్ అనేవి చిన్నపిల్లల ఆట ఏం కాదని మనందరికీ తెలుసు. ఎలాంటి స్టంట్ చేయాలన్నా కూడా.. దానికి ప్రాక్టీస్ చాలా అవసరం. అలాగే ట్రైనర్స్ పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. స్టంట్స్ చేసేటప్పుడు చిన్న పొరపాటు జరిగినా కూడా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ ఓ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు స్టంట్ చేయాలనీ ప్రయత్నిస్తారు. దెబ్బకు సీన్ కాస్తా రివర్స్ అవుతుంది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ కెమెరా ముందు ఇద్దరు అమ్మాయిలు స్కూటీలతో స్టంట్ చేయడానికి సిద్దమవుతున్నట్లు మీరు చూడవచ్చు. ఇక కెమెరామాన్ స్టార్ట్ అనగానే.. ఓ అమ్మాయి తన బైక్ ముందు చక్రాన్ని పైకి లేపి.. వేగంగా ముందుకు వెళ్లటానికి ప్రయత్నిస్తుంది. అది కాస్తా బెడిసికొట్టి బొక్కబోర్లా పడుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా, ఈ వీడియోను ‘bboyz.sbk’ అనే ఇన్‌స్టా పేజీ అప్‌లోడ్‌ చేయగా.. దీనికి ఇప్పటివరకు 79 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా నెటిజన్లు ఈ వీడియోపై వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేసి లైఫ్ రిస్క్ చేసుకోవడం అవసరమా అని ఒకరు కామెంట్ చేస్తే.. ఒక చక్రం పైకి లేపి స్కూటీ నడపాల్సిన అవసరం ఏముందని మరికొందరు ఆ యువతిపై మండిపడుతున్నారు.