Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turtle Video Viral: స్కేటింగ్‌ చేస్తున్న తాబేలు.. చూస్తే షాకవుతారు..! వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..

Turtle Video Viral: స్కేటింగ్‌ చేస్తున్న తాబేలు.. చూస్తే షాకవుతారు..! వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..

Anil kumar poka

|

Updated on: Jan 22, 2022 | 9:55 AM

Turtle Using Toy Car: సాధారణంగా తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఏదైనా జంతువు దానిపైకి దాడి చేయడానికి వచ్చినా పాపం త్వరగా పరుగెత్తలేదు. అందుకే దానికి రక్షణ కవచంగా బలమైన డిప్ప ఉంటుంది. అది చాలా గట్టిగా ఉంటుంది...



సాధారణంగా తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఏదైనా జంతువు దానిపైకి దాడి చేయడానికి వచ్చినా పాపం త్వరగా పరుగెత్తలేదు. అందుకే దానికి రక్షణ కవచంగా బలమైన డిప్ప ఉంటుంది. అది చాలా గట్టిగా ఉంటుంది. దానికి ఏదైనా ఆపద సంభవించినప్పుడు దాని లోపలికి ముడుచుకొని పోయి తనని తాను రక్షించుకుంటుంది. అలాంటి తాబేలుకు సడెన్‌గా స్పీడ్‌గా పరుగెత్తే అవకాశం దొరికితే దాని ఆనందానికి హద్దులేముంటాయి.. నిజంగానే ఇక్కడ ఓ తాబేలు తన కాళ్లకి చక్కాలు కట్టుకొని గిర గిరా తిరిగేస్తోంది.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని చూసి నెటిజన్లు “ఓసి దీని ఏషాలో..” అంటున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి…

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక ఇంట్లో తాబేలు ఒకటి చాలా వేగంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఇదేంటబ్బా అని చూస్తే.. అది ఒక కారు బొమ్మపైన కూర్చుంది. కారుకు నాలుగువైపులా చక్రాలు ఉన్నాయి. ఇక దానిపైన కూర్చున్న తాబేలు తన కాలుని కాస్త కదిపినా చక్రాలు వేగంగా కదులుతున్నాయి. దాంతో తనకు ఏదో కొత్త శక్తి వచ్చినట్లు అనుకుంది కాబోలు.. ఆ కారు బొమ్మపై కూర్చుని తెగ ఉత్సాహంగా ఆ ఇంట్లోని హాలంతా తిరిగేస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను వీక్షిస్తున్న వేలమంది నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు… “అంత స్పీడుగా వెళ్లకు.. నీకు కళ్లు కనిపించవు.. మధ్యలో ఆగి దారి చూసుకుంటూ వెళ్ళాలి’ అని ఒక యూజర్‌ కామెంట్‌ చేస్తే… “అది కుందేలులా వెళ్లిపోతోంది” అంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశారు.

Published on: Jan 21, 2022 08:48 AM