Police Humanity: శభాష్‌ మహిళా పోలీస్‌.. నిండు ప్రాణానికి రక్షగా..

Police Humanity: ఓ వృద్ధురాలిని ఆత్మహత్యా ప్రయత్నం నుండి రక్షించిన మహిళా పోలీసులకు అరుదైన గౌరవం దక్కింది.

Police Humanity: శభాష్‌ మహిళా పోలీస్‌.. నిండు ప్రాణానికి రక్షగా..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 20, 2022 | 9:50 AM

Police Humanity: ఓ వృద్ధురాలిని ఆత్మహత్యా ప్రయత్నం నుండి రక్షించిన మహిళా పోలీసులకు అరుదైన గౌరవం దక్కింది. మహిళా ఖాకీలు చేసిన పనికి జిల్లా ఎస్పీ అభిందించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. కురిచేడు ఎన్‌ఎస్‌పి కెనాల్ దగ్గర ఆత్మహత్య చేసుకోబోతున్న 75 ఏళ్ల వృద్ధురాలిని రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో కీలక పాత్ర పోషించిన మహిళా పోలీసులను ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్‌ అభినందించారు… ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

గుంటూరుజిల్లా వినుకొండకు చెందిన బిందె గాలెమ్మ కుటుంబ కలహాలతో మనస్తాపం చెందింది..ఈ నెల 17న వినుకొండకి బయలుదేరి కురిచేడు సమీపంలో ఎన్‌ఎస్‌పి కెనాల్ వద్దకు వెళ్లింది… కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేయబోతుండగా కురిచేడు ఒకటో సచివాలయం మహిళా పోలీస్‌ షేక్ మస్తాన్ బీ గమనించింది.. వెంటనే వృద్ధురాలి వద్దకు చేరుకొని ఆమెకు నచ్చజెప్పి కురిచేడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.. తొలుత వృద్ధురాలు తన వివరాలు తప్పుగా చెప్పటంతో…ఆ మహిళా పోలీస్ చాకచక్యంగా వ్యవహరించింది.. జిల్లాలోని అన్ని మహిళ పోలీస్ వాట్సాప్ గ్రూపులతో పాటు ఇతర గ్రూపులో వృద్ధురాలి ఫోటోలను షేర్ చేసింది. అలా బాధితురాలి కుటుంబ సభ్యులను గుర్తించారు. వినుకొండలోని ఆమె కొడుకు శ్రీనును కురిచేడు పోలీస్ స్టేషనుకి పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి ఆమెను క్షేమంగా తిరిగి అప్పగించారు.

ఈ ఘటనలో చొరవ చూపించి వృద్దురాలిని ఆత్మహత్య చేసుకోకుండా నిలువరించి నిండు ప్రాణాన్ని కాపాడిన కురిచేడు ఒకటో సచివాలయం మహిళా పోలీస్‌ షేక్‌ మస్తాన్‌బీ, వృద్దురాలి వివరాలు సేకరించడంలో ప్రతిభ కనబర్చిన వాగుమడుగు సచివాలయం మహిళా పోలీస్ బి.యశోదలను ఎస్పీ మల్లికా గార్గ్‌ ప్రత్యేకంగా అభినందించారు… ప్రశంసాపత్రాలను అందించి ప్రభుత్వానికి వీరి గురించి సిపార్సు చేస్తామని ఎస్పీ ప్రోత్సహించారు.

Also read:

ఇంటికి రానని మొండికేసిన సింహం !! బలవంతంగా ఎత్తుకెళ్లిన మహిళ !! వీడియో

Telangana News: ఏడుగురు సభ్యుల దొంగల ముఠా.. చేసేవన్నీ అలాంటి చోరీలే.. షాకింగ్ వివరాలు మీకోసం..!

Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వ్యత్యాసం.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. 

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు