Tourist Alert: అరకు వెళ్లే టూరిస్టులకు అలర్ట్.. 22 తరువాత పర్యాటక కేంద్రాలు మూత.. కారణం ఇదే..
సీజన్ మొదలైంది.. అరకులో కూల్ క్లైమేట్ కనిపిస్తోంది.. ఏజెన్సీ అంతా మంచు దుప్పటి కమ్ముకుంటుంది. ప్రకృతి సుందర దృశ్యాలు పర్యాటకులను రారమ్మని పిలుస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం పులకింప చేస్తుంది. అందుకే సీజన్ ప్రారంభమైతే.. దేశం నుంచి గాక విదేశాల నుంచి కూడా భారీగా పర్యాటకంలో వస్తూ ఉంటారు. కానీ ఈసారి వాళ్లకు నిరాశ ఎదురవనుందా..? ఈనెల 22 తర్వాత పర్యాటక ప్రాంతాలు మూతబడునున్నాయా..?

ఆలూరి సీతారామరాజు జిల్లా అరకులోయతో పాటు ఏజెన్సీలో చాలా ప్రాంతాల్లో ప్రముఖ పర్యటక కేంద్రాలు ఉన్నాయి. బొర్ర గుహలు, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, తైడ జంగిల్ బెల్స్, హరిత మయూరి, లంబసింగి ప్రాంతాలకు నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. సీజన్లో అయితే రద్దీ ఇంకా పెరిగిపోతోంది. ప్రస్తుతం సీజన్ మొదలైనట్టే..! పొగ మంచు దట్టంగా కమ్ముకుని ప్రకృతి సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. చల్లటి వాతావరణం పర్యాటకులను తమ వైపు ఆకర్షిస్తుంది. దీంతో వీకెండ్స్ లో రద్దీ బాగా పెరిగిపోతోంది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. మరికొన్ని రోజుల్లో కొన్ని పర్యటక ప్రాంతాల్లో మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయా పర్యటక ప్రాంతాలలో పనిచేస్తున్న టూరిజం కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఏళ్ల తరబడిగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లు సమస్యలను పరిష్కరించాలంటూ కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా టూరిజం ఆదోని నడుస్తున్న యూనిట్లపై 1000 మందికి పైగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేవలం అరకు పరిధిలోని ఆరు టూరిజం యూనిట్లలో 300 మంది టూరిజం కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. 2010 నుండి పరిష్కారం కాని దీర్ఘకాలిక సమస్యలున్నాయని కార్మికులు అంటున్నారు. దాదాపుగా 13 ఏళ్లు గడుస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారి వాదన.
డిమాండ్లు ఇవే..!
టూరిజం కార్మికులందరినీ పర్మినెంట్, 2010లో కార్పోరేషన్ యాజమాన్యం చేసిన ఒప్పందం అమలు చేయడం, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ హెచ్ఆర్ పాలసీని అమలు చేయటం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, విద్యార్హతను బట్టి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ వారికి పదోన్నతులు అదే కేటగిరీ లో ఉద్యోగం కల్పించడం,, ఈపీఎఫ్, కార్పొరేషన్ లో పనిచేసిన కార్మికులందరికీ గ్రాడ్యుటీ అమలు, పర్యాటక శాఖలోని బ్యాక్లాగ్ పోస్ట్ లను గిరిజన కార్మికులతోనే భర్తీ, మరమత్తులకు గురైన యూనిట్ల తక్షణ రిపేర్లూ, చనిపోయిన కార్మికులకు దహన సంస్కారాలకై 25 వేలు, కార్మికులకు బస్సు పాస్ , ఏజెన్సీ అలవెన్స్ లూ, కార్మికులందరికీ వాషింగ్ అలవాన్స్, యూనిఫామ్ ఇవ్వాలని, అల్లూరి జిల్లా కు ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు అరకు జిల్లా టూరిజం కార్మికుల అధ్యక్షుడు రాజు.
అయితే వీరి డిమాండ్లపై 2010లో అప్పటి టూరిజం శాఖ ఎం.డి చందనాకాంత్, 2012 లో ఉన్న టూరిజం శాఖ ఎండి శుక్లా , గత ఏడాది కూడా ప్రస్తుతము ఉన్న టూరిజం ఎండి అమరావతి సెక్రటేరియట్ కు తమన పిలిచి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారని… అన్ని సమస్యలు పరిష్కారిస్తామని వాగ్దానం చేసి నమ్మబలికి వాటిని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మిక నాయకులు.
అనివార్య పరిస్థితుల్లో నిరవధిక సమ్మె..!
ప్రభుత్వం గత ఏడాది టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సమక్షంలో ఆమోదించిన డిమాండ్లను పరిష్కారం చేయకపోతే ఈనెల 22 తరువాత అనివార్య పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు తప్పదు అంటున్నారు కార్మిక నాయకుడు గంగరాజు.
ఇప్పుడిప్పుడే పర్యాటక సీజన్ ప్రారంభమవుతుంది. పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని మొత్తం టూరిజం శాఖలో అత్యధిక ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న అల్లూరి జిల్లా మన్యంలోని టూరిజం యూనిట్లలో ఉద్యోగులు కార్మికుల సమ్మెకు దిగితే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కార్మికుల సమస్యలపై పరిష్కారానికి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం