Huge Pythons: అమ్మో..! కొండచిలువతో డేంజరే.!  మూడు భారీ కొండచిలువలు.. చేయి కరవడంతో..

Huge Pythons: అమ్మో..! కొండచిలువతో డేంజరే.! మూడు భారీ కొండచిలువలు.. చేయి కరవడంతో..

Anil kumar poka

|

Updated on: Oct 20, 2023 | 10:48 PM

పుట్టపర్తిలో భారీ కొండచిలువలు కలకలం రేపాయి. ఒకేరోజు ఒకే చోట మూడు పెద్ద పెద్ద కొండచిలువలు ప్రత్యక్షం అవడంతో జనం బెంబేలెత్తిపోయారు. పుట్టపర్తిలోని దుర్గమ్మ ఆలయం ప్రధాన రహదారిపై భారీ కొండ చిలువ కలకలం రేపింది. అలాగే స్థానిక ప్రైవేట్ పాఠశాల సమీపంలోని ఓ ఇంటి కాంపౌండ్ లోకి మరో కొండచిలువ చొరబడింది. అక్కడికి కూతవేటు దూరంలోనే నాగేపల్లిలోని ఓ ఇంటిలోకి మరో కొండచిలువ ప్రవేశించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

పుట్టపర్తిలో భారీ కొండచిలువలు కలకలం రేపాయి. ఒకేరోజు ఒకే చోట మూడు పెద్ద పెద్ద కొండచిలువలు ప్రత్యక్షం అవడంతో జనం బెంబేలెత్తిపోయారు. పుట్టపర్తిలోని దుర్గమ్మ ఆలయం ప్రధాన రహదారిపై భారీ కొండ చిలువ కలకలం రేపింది. అలాగే స్థానిక ప్రైవేట్ పాఠశాల సమీపంలోని ఓ ఇంటి కాంపౌండ్ లోకి మరో కొండచిలువ చొరబడింది. అక్కడికి కూతవేటు దూరంలోనే నాగేపల్లిలోని ఓ ఇంటిలోకి మరో కొండచిలువ ప్రవేశించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న స్నేక్‌ క్యాచర్‌ మూర్తి వెంటనే ఆ ఏరియాకు వెళ్లాడు. అతి కష్టం మీద మూడు కొండచిలువలను పట్టుకొని బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈక్రమంలో దుర్గమ్మ ఆలయం వద్ద కొండ చిలువను బంధిస్తుండగా మూర్తి పాము కాటుకు గురయ్యారు. కొండచిలువ మూర్తి చేయిని కొరికేసింది. దాంతో అతని చేతి నుంచి రక్తం కారింది. అనంతరం వైద్యం చేయించుకోవడంతో స్నేక్ క్యాచర్ మూర్తి కోలుకున్నారు. ఒకే రోజు, ఒకే చోట మూడు పాములు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మొత్తం మీద పాములను పట్టుకుని అటవీ ప్రాంతంలోకి వదిలేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 20, 2023 05:10 PM