Pakistan Flights: పాకిస్తాన్ లో ఇంధన కొరత.. 48 విమానాలు రద్దు.. పూర్తి వివరాలు.

Pakistan Flights: పాకిస్తాన్ లో ఇంధన కొరత.. 48 విమానాలు రద్దు.. పూర్తి వివరాలు.

Anil kumar poka

|

Updated on: Oct 20, 2023 | 8:59 PM

ఆర్థిక ఇబ్బందుల్లో పీకల దాకా కూరుకుపోయిన పాకిస్తాన్‌కు ఇంధన కొరత సమస్యగా మారింది. దీంతో పదుల సంఖ్యలో విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన 48 విమానాలను రద్దు చేసింది. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. తాజాగా 24 విమానాలను రద్దు చేయగా.. అందులో 11 అంతర్జాతీయ, 13 దేశీయ సర్వీసులున్నాయి.

ఆర్థిక ఇబ్బందుల్లో పీకల దాకా కూరుకుపోయిన పాకిస్తాన్‌కు ఇంధన కొరత సమస్యగా మారింది. దీంతో పదుల సంఖ్యలో విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన 48 విమానాలను రద్దు చేసింది. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. తాజాగా 24 విమానాలను రద్దు చేయగా.. అందులో 11 అంతర్జాతీయ, 13 దేశీయ సర్వీసులున్నాయి. బుధవారం కూడా మరో 16 అంతర్జాతీయ, 8 దేశీయ సర్వీసులను రద్దు చేసినట్లు అధికార ప్రతినిధి పాక్‌ మీడియాకు వెల్లడించారు. రోజువారీ ఇంధన సరఫరాలో కొరత, నిర్వహణ కారణాలతోనే సర్వీసులను రద్దు చేసినట్లు ఆ ప్రతినిధి తెలిపారు. మరికొన్ని విమానాలను రీషెడ్యూల్‌ చేసినట్లు తెలిపారు. రద్దయిన సర్వీసుల్లోని ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానాల్లో గమ్యస్థానాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

పాక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌.. ఇంధనం కోసం పాక్‌ స్టేట్‌ ఆయిల్‌ సంస్థకు రోజుకు 100 మిలియన్‌ పాకిస్థానీ రూపాయలు వెచ్చించాల్సి ఉంది. అయితే, అడ్వాన్స్‌ చెల్లింపులు లేనిదే ఇంధనాన్ని సరఫరా చేయబోమని పీఎస్‌వో తేల్చి చెప్పింది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎయిర్‌లైన్స్‌.. బకాయిలు చెల్లించలేకపోయింది. దీంతో పీఎస్‌వో ఇంధన సరఫరాను నిలిపివేసింది. ఫలితంగా విమాన సర్వీసుల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలను రద్దు చేసే అవకాశముందని ఎయిర్‌లైన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..