CM Jagan: లబ్దిదారుల సెల్ ఫోన్ లోనే పూర్తి ఆరోగ్యశ్రీ సమాచారం.. యాప్ డౌన్ లోడ్ చేయించే పనిలో ఉన్న వాలంటీర్లు
సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా వైద్యసేవలను విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను నాడు-నేడు ద్వారా పూర్తి స్థాయిలో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల పోస్టుల భర్తీని భారీగా చేపట్టింది. స్పెషలిస్ట్ వైద్యులతో పాటు హాస్పిటల్స్ లో అవసరమైన సిబ్బంది నియామకాల కోసం ప్రత్యేకంగా బోర్డు కూడా ఏర్పాటుచేసారు ముఖ్యమంత్రి జగన్. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నాణ్యమైన వైద్యం అందించేలా ప్రత్యేక శ్రద్ద కనబరిచారు సీఎం జగన్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైద్యరంగంలో కీలక మార్పులు తీసుకొస్తున్నారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా వైద్యసేవలను విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను నాడు-నేడు ద్వారా పూర్తి స్థాయిలో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల పోస్టుల భర్తీని భారీగా చేపట్టింది. స్పెషలిస్ట్ వైద్యులతో పాటు హాస్పిటల్స్ లో అవసరమైన సిబ్బంది నియామకాల కోసం ప్రత్యేకంగా బోర్డు కూడా ఏర్పాటుచేసారు ముఖ్యమంత్రి జగన్.
ఇప్పటివరకూ 50 వేలకు పైగా వైద్యారోగ్య శాఖలో పోస్టులను భర్తీ చేసారు..కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించేలా ఏర్పాట్లు చేసారు.. అంతేకాదు ప్రస్తుతం జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వైద్య సేవలను తీసుకెళ్లారు. ఇక తన తండ్రి,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ సేవల విషయంలో అత్యంత శ్రద్ద తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆరోగ్య శ్రీ ద్వారా సేవలను పెంచడంతో పాటు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు..తాజాగా ఆరోగ్యశ్రీ విషయంలో మరో కీలక నిర్నయం తీసుకున్నారు ముఖ్యమంత్రి.
సెల్ ఫోన్ లోనే పూర్తి ఆరోగ్య సమాచారం
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నాణ్యమైన వైద్యం అందించేలా ప్రత్యేక శ్రద్ద కనబరిచారు సీఎం జగన్…వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు..గతంలో ఉన్న విధానాన్ని మరింత పారదర్శకంగా అమలుచేసేలా చర్యలు తీసుకున్నారు…ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందే రోగులకు ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి డిశ్చార్జి అయ్యే వరకూ ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఆరోగ్యమిత్రల ద్వారా సమాచారం అందిస్తున్నారు..
ఇక జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్తున్న సిబ్బంది ఆరోగ్యశ్రీ విషయంలో ప్రజలకు ముందస్తు సమాచారం అందిస్తున్నారు..తాజాగా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మరింత మెరుగ్గా సౌకర్యాలు కల్పించేలా సులభతరం విధానం అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం..ఒక కుటుంబంలోని వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే ఆ కుటుంబంలోని వ్యక్తుల యొక్క పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది…ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించే ఆసుపత్రుల పూర్తి సమాచారం యాప్ లో పొందుపరిచారు..
మెడికల్ రిపోర్టులు అవసరమైతే..
ఒక వ్యక్తి చేయించుకున్న చికిత్స ఏంటి…?దఆనికి ఎలాంటి పరీక్షలు నిర్వహించారు..అనే సమాచారం ఉంటుంది..భవిష్యత్తులో ఎప్పుడైనా మెడికల్ రిపోర్టులు అవసరమైతే యాప్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు…కార్డు దారులకు అవసరమైన చికిత్స ఏ ఆసుపత్రిలో అందుతుంది,ఎక్కడెక్కడ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి..?ఒక రోగి చికిత్స కోసం ప్రభుత్వం ఎంతమేర చెల్లించింది వంటి పూర్తి సమాచారం అంతా యాప్ లో ఉంటుంది. దీంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథం మరింత సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతుంది.
యాప్ డౌన్ లోడ్ చేయించే పనిలో ఉన్న వాలంటీర్లు
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కొనసాగుతుంది…వలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి ఆయా కుటుంబాల్లోని వారి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తీసుకుని వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు..ఇదే సమయంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ ను డౌన్ లోడ్ చేయిస్తున్నారు..క్లస్టర్ల వారీగా లబ్దిదారుల ఫోన్లలో వలంటీర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేయించి దానికి సంబంధించిన సమాచారం వివరిస్తున్నారు.ఇప్పటవరకూ సుమారు 7 లక్షల మంది లబ్దిదారుల ఫోన్ లలో ఆరోగ్యశ్రీ యాప్ ను డౌన్ లోడ్ చేయించారు వాలంటీర్లు..రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ లబ్దిదారుల అందరి ఫోన్ లలో ఈ యాప్ ఉండేలా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం