AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల భేటీ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. ఏమన్నారంటే..?

Minister Perni Nani: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి గురువారం ఆమోదం తెలిపిన

Tollywood: మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల భేటీ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. ఏమన్నారంటే..?
Dilraju
Shaik Madar Saheb
|

Updated on: Oct 29, 2021 | 1:36 PM

Share

Minister Perni Nani: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి గురువారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సచివాలయంలో మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. మంత్రి పేర్ని నానిని నిర్మాతలు దిల్‌ రాజు, అలంకార్‌ ప్రసాద్‌ ఇతర నిర్మాతలు కలిసి పలు విషయాలపై మాట్లాడారు. సిననీ రంగానికి సంబంధించిన పలు సమస్యలు, సినిమాటోగ్రఫీ చట్టం సవరణ, ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు పేర్కొంటున్నారు.

కాగా.. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ నిర్మాతలు పలు అనుమానాలను వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నాగర్జున.. గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అయి మాట్లాడారు. ఆయన సీఎం జగన్‌ను కలిసిన అనంతరం .. తాజాగా సినీ నిర్మాతలు మంత్రి పేర్ని నానితో భేటీ కావడం ప్రధాన్యం సంతరించుకుంది.

ఈ సమావేశం అనంతరం దిల్‌రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ నుంచి కొంత సమాచారం అడిగిందని.. అది ఇవ్వడానికే మంత్రిని కలిసినట్లు వెల్లడించారు. అందుకే కలిశామంటూ దిల్ రాజు మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు.

Also Read:

Viral Video: ట్రాఫిక్‌లో బైక్‌తో స్టంట్లు చేశాడు.. యముడికి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు.. డేంజర్ వీడియో వైరల్

RRR Movie: ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం… ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి మరో ముందడుగు..

Pan India Movies: పాన్ ఇండియా సినిమాలతో చరిత్ర సృష్టించడానికి రెడీ అవుతున్న టాలీవుడ్ హీరోలు..