Janasena Party: బీజేపీ చేసే ప్రతిదీ ఒప్పుకోవడానికి మేం డూడూ బసవన్నలం కాదు.. జనసేన నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Janasena Party: బీజేపీ చేసే ప్రతి దాన్నీ ఒప్పుకోవటానికి తాము డూడూ బసవన్నల౦ కాదని జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ శివశంకర్ వ్యాఖ్యానించారు. తమ సిద్ధాంతాలు తమకుంటాయి.. వాళ్ల సిద్ధాంతాలు వాళ్లకు౦టాయని పేర్కొన్నారు.

Janasena Party: బీజేపీ చేసే ప్రతిదీ ఒప్పుకోవడానికి మేం డూడూ బసవన్నలం కాదు.. జనసేన నేత ఆసక్తికర వ్యాఖ్యలు
Shiva Sankar
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 29, 2021 | 1:21 PM

Janasena Party: బీజేపీ చేసే ప్రతి దాన్నీ ఒప్పుకోవటానికి తాము డూడూ బసవన్నల౦ కాదని జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ శివశంకర్ వ్యాఖ్యానించారు. తమ సిద్ధాంతాలు తమకుంటాయి.. వాళ్ల సిద్ధాంతాలు వాళ్లకు౦టాయని పేర్కొన్నారు. బీజేపీతో తాము పెట్టుకున్నది కేవలం ఎన్నికల పొత్తు మాత్రమేనని స్పష్టంచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ వైఖరిని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు ఈనెల 31న జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ వస్తున్నట్లు తెలిపారు.  మధ్యాహ్నం 2గంటలకు కూర్మన్నపాలెం జంక్షన్లోని దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యమానికి మద్దతు తెలియజేయస్తారని వెల్లడించారు.  అనంతరం జరగనున్న బహిరంగ సభలో తన సందేశం ద్వారా ఉద్యమానికి దశ దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు.

జనసేన పార్టీ ముందు నుంచీ ఉక్కు ఉద్యమంలో ఉందని శివశంకర్ పేర్కొన్నారు. ప్రయివేటీకరణ నిర్ణయం వెలువడిన వెంటనే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసినట్లు గుర్తుచేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర పెద్దలను కోరినట్లు వివరించారు. ఇది ఒక సామాజిక అంశమో..వ్యాపార అంశమో..రాజకీయ ప్రక్రియో కాదన్నారు.

పవన్ కల్యాణ్ సభ నేపథ్యంలో తమ వైపు నుంచి పోలీసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 500 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా మీటింగ్ నిర్వహిస్తామన్నారు. పవన్ పర్యటనకు పోలీసులు తొందరగా అనుమతులు ఇచ్చినట్లయితే తాము ఏర్పాట్లు చేసుకుంటామన్నారు.

Also Read..

Srisailam Treasures: శ్రీశైలంలో భారీగా గుప్త నిధులు.. తామ్ర శాసనాల్లో విలువైన సమాచారం.. అందుకే రసహ్యంగా ఉంచారా?

KTR France Tour: ఫ్రాన్స్‌లో కొనసాగుతోన్న కేటీఆర్‌ పర్యటన.. సీఈవోలతో వరుస సమావేశాలు..