AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ట్రాఫిక్‌లో బైక్‌తో స్టంట్లు చేశాడు.. యముడికి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు.. డేంజర్ వీడియో వైరల్

Bike Stunt Video: ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేయడం పెద్ద సహాసమే. అయితే ఈ విన్యాసాలు ప్రత్యేకమైన ప్రదేశంలో, అదికూడా నిపుణుల పర్యవేక్షణలో చేస్తారు. కానీ రోడ్డుపై

Viral Video: ట్రాఫిక్‌లో బైక్‌తో స్టంట్లు చేశాడు.. యముడికి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు.. డేంజర్ వీడియో వైరల్
Bike Stunt
Shaik Madar Saheb
|

Updated on: Oct 29, 2021 | 12:42 PM

Share

Bike Stunt Video: ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేయడం పెద్ద సహాసమే. అయితే ఈ విన్యాసాలు ప్రత్యేకమైన ప్రదేశంలో, అదికూడా నిపుణుల పర్యవేక్షణలో చేస్తారు. కానీ రోడ్డుపై ప్రమాదకరమైన విన్యాసాలు మాత్రం అస్సలు చేయకూడదు.. కానీ కొంతమంది అవేమీ పట్టించుకోకుండా.. వేగంగా వెళ్తున్న వాహనాల మధ్య స్టంట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలా ప్రమాదకరమైన విన్యాసాలు చేసి కొందరు అవిటివారిగా మిగలగా.. మరికొందరు కుటుంబాలకు తీవ్ర శోకాన్ని మిగిలిస్తున్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి స్టంట్స్ చేయొద్దంటూ తరచూ పోలీసులు, పలు సంస్థలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. వినకుండా కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ కావాలన్న ముసుగులో ద్విచక్రవాహనాలతో స్టంట్లు చేస్తుంటారు. ఇలా ద్విచక్రవాహనంతో విన్యాసాలు చేస్తూ.. ఓ యువకుడు ప్రాణాలు పొగొట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా.. ట్రాఫిక్ ఉన్న సమయంలో అసలు ఎందుకీ విన్యాసం చేసి ప్రాణాలు పొగొట్టుకున్నాడంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు ఇంకెవ్వరూ చెయొద్దంటూ ప్రాధేయపడుతున్నారు.

ఈసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ప్రధాన రహదారిపై బైక్‌పై వెళ్తున్నాడు. బైక్‌పై వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా స్టంట్లు చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో ఇరువైపుల నుంచి వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి. కొన్ని సెకన్లు అంతా బాగానే ఉంటుంది. కానీ, అకస్మాత్తుగా వేగానికి బైక్ అదుపుతప్పుతుంది. దీంతో వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న డంపర్‌ని ఢీకొంటాడు. డంపర్ కూడా వేగంతో వస్తుండటంతో బైక్‌పై వెళ్తున్న లేచి అవతల పడతాడు. దీంతో వీడియో ముగుస్తుంది. నిజానికి బైక్‌తో స్టంట్లు చేసిన వ్యక్తి బతికి ఉండటు. ఎందుకంటే.. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే అందరికీ భయం వేస్తోంది.

డెంజరస్ వీడియో..

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూసి నెటిజన్లంతా భయపడుతన్నారు. ఈ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఇలా చేయకండి అంటూ రాశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాదిమంది వీక్షించారు. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తు్న్నారు. ఇలాంటి స్టంట్లు అసలు చేయొద్దని.. ఒకవేళ చేస్తే నిపుణుల పర్యవేక్షణలో చేయాలంటూ సూచిస్తున్నారు. ప్రయాణం చేసేటప్పుడు.. మీకోసం కుటుంబాలు ఇంటి దగ్గర వేచిచూస్తుంటాయి.. జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.

Also Read:

Viral Video: జిరాఫీని వేటాడిన సింహం.. వేటలో అద్భుత ట్విస్ట్.. చివరికి ఏమైందంటే.!

RRR Movie: ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం… ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి మరో ముందడుగు..