Viral Video: జిరాఫీని వేటాడిన సింహం.. వేటలో అద్భుత ట్విస్ట్.. చివరికి ఏమైందంటే.!
అడవిలో నియమాలు వేరేగా ఉంటాయి. జంతువు ఏదైనా కూడా ఎలప్పుడూ ఆహారం కోసం వెతుకుతూనే ఉండాలి. ఇక అందుకోసం అవి తరచూ..
అడవిలో నియమాలు వేరేగా ఉంటాయి. జంతువు ఏదైనా కూడా ఎలప్పుడూ ఆహారం కోసం వెతుకుతూనే ఉండాలి. ఇక అందుకోసం అవి తరచూ తమ వేటను కొనసాగిస్తాయి. వేటాడేటప్పుడు ఖచ్చితంగా తెలివి, వ్యూహాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. లేదంటే ప్రాణాలు కోల్పోవాల్సిందే.
ఇదిలా ఉంటే.. కొన్నిసార్లు క్రూర జంతువులు కూడా వేటాడేటప్పుడు ఓటమిని చవి చూస్తుంటాయి. బహుశా.. ఎరగా ఎంచుకున్న జంతువు.. తనకంటే బలశాలి కావొచ్చు. లేదా వ్యూహం సరిగ్గా ఫలించకపోవచ్చు. సరిగ్గా ఇదే పరిణామం అడవికి రాజైన సింహానికి ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా సింహాన్ని దూరం నుంచి చూస్తే చాలు.. మిగతా జంతువులు పరుగులు పెడతాయి. సింహం పంజా పవర్ అలాంటిది మరి. అయితే, ఇక్కడ సీన్ కాస్త రివర్స్ అయింది. జిరాఫీని వేటాడాలని ప్రయత్నించిన సింహం.. దాని కాళ్ల కింద పడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
— Life and nature (@afaf66551) May 16, 2021
వైరల్ వీడియో ప్రకారం.. ఆకలి మీదున్న ఓ సింహం.. జిరాఫీని వేటాడటానికి ప్రయత్నిస్తుంది. సరాసరి జిరాఫీ మెడను తన పదునైన దంతాలతో పట్టుకోవడానికి గాల్లోకి ఎగురుతుంది. ఒక్క క్షణం మీరు కూడా వీడియో చూసి షాకవుతారు. జిరాఫీ ప్రాణాలు ఇక పోయినట్లే అని అనుకునేలోపే.. సీన్ కాస్తా రివర్స్ అవుతుంది. సింహం బ్యాలెన్స్ తప్పుతుంది. అంతే.. ఇంకేముంది జిరాఫీ.. మృగరాజును కాళ్లతో తొక్కి పడేస్తుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. కాగా, ఈ వీడియోను ‘లైఫ్ అండ్ నేచర్’ అనే పేజ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇప్పటిదాకా 6.8 వేల మంది దీనిని వీక్షించారు. నెటిజన్లు కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!
Also Read:
తవ్వకాల్లో దొరికిన 100 ఏళ్లనాటి ప్రేమలేఖ.. అందులో ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
వాకింగ్ ట్రాక్‌పై నల్లటి ఆకారం.. దగ్గరకు వెళ్లి చూడగా సడన్ షాక్.. వైరల్ వీడియో.!