Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: తవ్వకాల్లో దొరికిన 100 ఏళ్లనాటి ప్రేమలేఖ.. అందులో ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

ప్రేమను మించిన మధురానుభూతి ఏదీ లేదని పెద్దలు అంటుంటారు. మనల్ని మరో కొత్త లోకంలోకి తీసుకెళ్ళేది ప్రేమ.. మనలో మార్పును...

Viral News: తవ్వకాల్లో దొరికిన 100 ఏళ్లనాటి ప్రేమలేఖ.. అందులో ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
Love Letter
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 28, 2021 | 1:21 PM

ప్రేమను మించిన మధురానుభూతి ఏదీ లేదని పెద్దలు అంటుంటారు. మనల్ని మరో కొత్త లోకంలోకి తీసుకెళ్ళేది ప్రేమ.. మనలో మార్పును తీసుకోచ్చేది ప్రేమ. ప్రేమ గురించి చెప్పేందుకు ఎన్నో కవిత్వాలు ఉన్నాయి. ఏంటి ఇప్పుడు ప్రేమ గురించి చెబుతున్నానని అనుకుంటున్నారా.? ఇప్పుడు మేము చెప్పబోయేది వింటే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ప్రేమను వ్యక్తపరిచేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కొందరు తనకు నచ్చిన అమ్మాయికి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తే.. మరికొందరు ప్రేమ లేఖలు రాస్తారు. ఏది ఏమైనా ప్రతీ వ్యక్తి తనకు ఇష్టమైన అమ్మాయికి జీవితాంతం గుర్తిండిపోయేలా ప్రపోజ్ చేయాలనుకుంటారు. అయితే ఈ అన్ని మార్గాలలోనూ ప్రేమలేఖతో తన ప్రేమను వ్యక్తపరచడం రొమాంటిక్ పద్దతి అని చెప్పొచ్చు. అందరూ కూడా కవిత్వాన్ని కాగితంపై పెట్టి మరీ తమ లవ్‌ను వ్యక్తపరుస్తారు. ఇక తాజాగా అలాంటి ఓ ప్రేమలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని కథ తెలిస్తే మీరూ రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోతారు.

బ్రిటన్‌లో నివాసముంటున్న14 ఏళ్ల బాలుడికి 100 ఏళ్ల నాటి ప్రేమలేఖ లభ్యమైంది. ఇక అది తన ప్రేమికురాలి కోసం ఓ ప్రియుడు రాసిన సీక్రెట్ లేఖ అని తెలుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. 14 ఏళ్ల లూకాస్ కోర్న్స్‌కు అతడి గదిలోని టైల్స్ క్రింద ఈ లేఖ దొరికింది. ఈ ప్రేమలేఖ 100 ఏళ్ల నాటిది కాగా.. దీనిని రాసిన వ్యక్తి మాత్రం ఇప్పుడు బ్రతికిలేడు. అయితే అతడి ప్రేమకథ మాత్రం ఈ లేఖ రూపంలో ఇంకా సజీవంగానే ఉంది.

Letter

 

కాగా, ఈ ప్రేమలేఖ రాసిన వ్యక్తి పేరు రొనాల్డ్. అతడు ‘నా ప్రియతమా, నువ్వు ప్రతిరోజూ ఉదయం నన్ను కలవడానికి ప్రయత్నిస్తావా. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పకు, ఇది నీకు నాకు మధ్య ఓ రహస్యంగానే ఉండాలి. నీకు పెళ్లయింది కాబట్టి దీనిని ఖచ్చితంగా గుర్తుంచుకో. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ప్రతిరోజూ అర్ధరాత్రి ఫుల్‌వుడ్ ట్రామ్ కార్నర్‌లో నన్ను కలుసుకో. నీ కోసం వేచి చూస్తాను. ఇట్లు నీ ప్రేమికుడు.”

ఇవి చదవండి:

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!

Viral: సరదాగా 4 గంటలు పబ్‌లో గడిపారు.. మద్యం సేవించారు.. చివరిగా బిల్లు చూసి నోరెళ్లబెట్టారు!

Garuda Puranam: ఈ 3 అలవాట్లు వెంటనే మానేయాలి.. లేదంటే కష్టాలు తప్పవు.!