Tirumala Brahmotsavalu: బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. ఎంతంటే?

బ్రహ్మోత్సవ రోజుల్లో 5 లక్షల 69 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్క గరుడ సేవ రోజున మూడు లక్షల మంది వాహన సేవలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో 24 లక్షల లడ్డూ విక్రయాలు జరిగాయి.

Tirumala Brahmotsavalu: బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. ఎంతంటే?
Ttd Hundi Income
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 06, 2022 | 11:01 AM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య. వచ్చిన హుండీ ఆదాయంవంటి వివరాలను వెల్లడించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలంటే అది అంగరంగ వైభవంగా సాగే ఒకానొక ఆధ్యాత్మిక విశేషం. ఈ బ్రహ్మోత్సవ రోజుల్లో 5 లక్షల 69 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్క గరుడ సేవ రోజున మూడు లక్షల మంది వాహన సేవలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో 24 లక్షల లడ్డూ విక్రయాలు జరిగాయి. 20 కోట్ల 43 లక్షల రూపాయల హుండీ ఆదాయం లభించింది. కాగా బ్రహ్మోత్సవాలకు వచ్చిన పిల్లలు తప్పి పోకుండా 1. 25 లక్షల ట్యాగులను పంపిణీ చేశారు నిర్వాహకులు. 2.20లక్షలకు పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 42 వేల గదులను భక్తులకు కేటాయించినట్టు చెప్పారు అధికారులు. 20.99 లక్షల మంది అన్న ప్రసాదం స్వీకరించినట్టు చెబుతున్నాయి గణాంకాలు. 9 వేల వాహనాలు తిరుమలలో పార్కింగ్ చేసుకునేందుకు ఏర్పాటు చేశారు. 7 రాష్ట్రాల నుండి కళాకారులు మాడవీధుల్లో ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.

త్వరలోనే ఆ ఆలయానికి భూమి పూజ..

తిరుమల గిరులు శోభాయమానంగా వెలుగొందడంలో భాగంగా.. 35 టన్నుల పుష్పాలతో అలంకరణలు చేపట్టారు. పుస్తక విక్రయాల ద్వారా టీటీడీకి రూ.31 లక్షల ఆదాయం లభించిందని చెబుతున్నారు టీటీడీ అధికారులు. ఇక 12638 ఆర్టీసీ ట్రిప్పులతో 3.47లక్షల మందిని తిరుమలకు చేరవేయడం గమనార్హం. ఏపీలోని 26 జి‌ల్లాల నుండి 6997 మంది వెనుకబడిన ప్రాంతాల వారికి శ్రీవారి దర్శనం కల్పించినట్టు చెబుతున్నారు పాలకమండలి సభ్యులు. అయితే ఎల్ఈడీ స్క్రీన్లు ఎక్కువగా ఏర్పాటు చేయలేదని భక్తులు ఫిర్యాదు చేశారని, వచ్చే బ్రహ్మోత్సవాల్లో ఎక్కువగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది పాలకమండలి.

గరుడసేవ రోజూ లేపాక్షి దగ్గర తోపులాట జరిగినప్పటికీ అధికారులు నియంత్రించారని పాలక మండలి తెలిపింది. త్వరలోనే గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతికి తరలిస్తామని పేర్కొంది. గుజరాత్ లో శ్రీవారి ఆలయ నిర్మానానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాలు కేటాయిస్తోందనీ.. త్వరలోనే భూమిపూజ నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..