Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది.. ఆరునెలల్లోపు మళ్లీ దర్శనం తేదీ మార్చుకోవచ్చు.. టీటీడీ ఛైర్మన్‌

తిరుపతి, తిరుమలలో కురస్తున్న భారీ వర్షాలకు బుధవారం ఉదయం ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద బండరాళ్లు మీద రెండో ఘాట్ రోడ్డులోని చివరి మలుపు

Tirumala:  శ్రీవారి భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది.. ఆరునెలల్లోపు మళ్లీ దర్శనం  తేదీ మార్చుకోవచ్చు.. టీటీడీ ఛైర్మన్‌
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2021 | 2:04 PM

తిరుపతి, తిరుమలలో కురస్తున్న భారీ వర్షాలకు బుధవారం ఉదయం ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద బండరాళ్లు మీద రెండో ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద రహదారి భారీగా కోతకు గురైంది. భాష్యకార్ల సన్నిధికి సమీపంలోని మలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా రోడ్డు కోతకు గురికావడంతో రెండో ఘాట్‌ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా విరిగిపడిన కొండచరియల ప్రాంతాన్ని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ధ్వంసమైన ఘాట్‌ రోడ్డు మరమ్మతులు పూర్తయ్యే వరకు డౌన్‌ ఘాట్‌ రోడ్డులోనే వాహనాల రాకపోకలను అనుమతిస్తామని ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు బుక్‌ చేసుకుని వాహనాల్లో వచ్చే శ్రీవారి భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ ఛైర్మన్‌ సూచించారు. వారికి వచ్చే ఆరునెలల్లోగా దర్శనంతేదీ మార్పు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఇక నడకదారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేదని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఐఐటీ నిపుణులతో అధ్యయనం.. కాగా ఇటీవల తిరుపతి- తిరుమల ఘాట్‌ రోడ్లలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడుతుండడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఢిల్లీ ఐఐటీ నిపుణులు తిరుమలకు రానున్నారని టీటీడీ ఛైర్మన్‌ వెల్లడించారు. టీటీడీ విజిలెన్స్‌, ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి వారు ఘాట్‌ రోడ్లను పరిశీలించనున్నారు. కొండచరియలు ఎక్కువగా విరిగిపడుతోన్న ప్రదేశాలను సందర్శించి, పూర్తి అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు.

Also Read:

AP Weather: ఏపీని వెంటాడుతున్న వరుణుడు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

Crime News: పులివెందులలో మహిళ దారుణ హత్య.. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే హతమార్చిన కిరాతకుడు!

Malladi vasu: ‘కొడాలి నాని, వల్లభనేని వంశీలను భౌతికంగా లేకుండా చెయ్యాలి’.. మధిర కౌన్సిలర్ సంచలన కామెంట్స్