AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malladi vasu: ‘కొడాలి నాని, వల్లభనేని వంశీలను భౌతికంగా లేకుండా చెయ్యాలి’.. మధిర కౌన్సిలర్ సంచలన కామెంట్స్

సెన్సేషన్ కామెంట్స్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కామన్ అయిపోాయాయి. ఎక్కడో ఉత్తరాదిలో తరచూ వినే కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి.

Malladi vasu: 'కొడాలి నాని, వల్లభనేని వంశీలను భౌతికంగా లేకుండా చెయ్యాలి'.. మధిర కౌన్సిలర్ సంచలన కామెంట్స్
Malladhi Vasu
Ram Naramaneni
|

Updated on: Dec 01, 2021 | 1:18 PM

Share

సెన్సేషన్ కామెంట్స్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కామన్ అయిపోాయాయి. ఎక్కడో ఉత్తరాదిలో తరచూ వినే కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి. కులంలో చీడపురుగుల్లా తయారైన వల్లభనేని వంశీ, కొడాలి నానీని భౌతికంగా లేకుండా చెయ్యాలంటూ ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ మల్లాది వాసు కనీవినీ ఎరుగని వ్యాఖ్యలు చేశాడు. వాళ్లిద్దరినే కాదు.. మదపుటేనుగులా ప్రవర్తిస్తున్న అంబటి రాంబాబునూ అలాగే చెయ్యాలంటూ మాట్లాడాడు వాసు. ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి మరీ ఈ లక్ష్యాన్ని చేరుకోవాలన్నట్లు మాట్లాడాడు. అందుకోసం అవసరమైతే 50లక్షలు ఆర్థికసాయం చేస్తానంటున్నాడు.

కమ్మ సంఘం వన సమారాధనలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు కమ్మవారికి ధైర్యంగా ఉన్న పరిటాల రవిని భౌతికంగా నిర్మూలించడం కోసం అప్పట్లో కొందరు ఆపరేషన్ నడిపించారు. అందుకు మొద్దు శీనును వాడుకున్నారు. పరిటాల బతికి ఉండి ఉంటే.. ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదంటున్నాడు వాసు. మొన్న జరిగిన సంఘటన మాముూలుది కాదు.. భవిష్యత్‌లో ఇంకా జరుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ప్రతీకారం తీర్చుకోవాలంటూ పగను రగిలించే మాటలు మాట్లాడాడు వాసు. కమ్మ పెద్దలందరూ ఓ ప్రణాళిక చేపట్టాలంటూ సూచిస్తున్న వాసు చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. నాని, వంశీతో పాటు అంబటి రాంబాబు వంటి వాళ్లను భౌతికంగా దూరం చెయ్యాలి.. అందుకోసం 50లక్షలు ఆర్థిక సాయం చేస్తానంటూ రెచ్చిపోయిన వాసు మాటలు ఇప్పుడు ఆ కులంలోనే చర్చకు దారితీస్తున్నాయి.

Also Read: తీవ్ర విషాదంలో కిరణ్ అబ్బవరం.. రోడ్డు ప్రమాదంలో హీరో సోదరుడు దుర్మరణం

మీరు కంచికచర్ల మీదుగా ప్రయాణం చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త !

కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు