Tirumala Rush: తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత టైమ్ పడుతోందంటే?
Andhra Pradesh: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూకాంప్లెక్స్‌లు, కంపార్ట్‌మెంట్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. సర్వదర్శనానికి దాదాపు 48గంటల టైమ్ పడుతుండటంతో భక్తులు క్యూలైన్లలోనే మగ్గిపోతున్నారు.
Andhra Pradesh: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూకాంప్లెక్స్‌లు, కంపార్ట్‌మెంట్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. సర్వదర్శనానికి దాదాపు 48గంటల టైమ్ పడుతుండటంతో భక్తులు క్యూలైన్లలోనే మగ్గిపోతున్నారు. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమలలో ఎటుచూసినా భక్తజన సందోహమే కనిపిస్తోంది. క్యూలైన్లు, సత్రాలన్నీ నిండిపోయి కిక్కిరిసిపోయాయి. శ్రీవారి సర్వదర్వనానికి 36 నుంచి 48గంటల సమయం పడుతుందంటే కొండపై పరిస్థితి ఎలాగుందో అర్ధంచేసుకోవచ్చు. క్యూలైన్లలో రెండు మూడు కిలోమీటర్ల మేర బారులు తీరారు భక్తులు. కగా తిరుమలలో ప్రస్తుతంరూ.300ల ప్రత్యేక దర్శనం, సర్వదర్శనానికి మాత్రమే టీటీడీ అనుమతిస్తోంది. అంతేకాదు, ఈనెల 21వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు, సిఫార్సు దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. అయితే కొందరు పెద్దలు ఈ నిర్ణయాన్ని పెడచెవిన పెడుతున్నారు. అనుచరగణంతో శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.
ప్రధానంగా వీఐపీ అండ్ ప్రొటోకాల్ దర్శనాలతో సర్వదర్శనం సమయం అంతకంతకూ పెరిగిపోతోంది. శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతోన్న భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో మగ్గిపోతున్నారు. ఇక క్యూలైన్లలో భక్తులను కంట్రోల్ చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారు పోలీసులు. కొండపైకి ఉరుకులు పరుగులతో దూసుకొస్తున్న భక్తులకు సర్దిచెబుతూ పంపిస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం ఒకవైపు గంటల తరబడి పడిగాపులు పడుతోన్న భక్తులు, మరోవైపు గదులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. చలికి వణికిపోతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి