CI Anju Yadav: కులం రంగు పులుముకున్న సీఐ అంజూయాదవ్ ఇష్యూ.. వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల తూటాలు
ఆ పోలీస్ అధికారి వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్ లోనే కాదు.. సామాజిక వర్గాల్లోనూ చిచ్చు రేపింది. పోలీసు యూనిఫాంలో దూకుడు ప్రదర్శించిన సీఐ అంజూ వ్యవహారం క్యాస్ట్ లో కాంట్రవర్సిటీ కి కారణమైంది.
ఆ పోలీస్ అధికారి వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్ లోనే కాదు.. సామాజిక వర్గాల్లోనూ చిచ్చు రేపింది. పోలీసు యూనిఫాంలో దూకుడు ప్రదర్శించిన సీఐ అంజూ వ్యవహారం క్యాస్ట్ లో కాంట్రవర్సిటీ కి కారణమైంది. ఆమెకు అనుకూలంగా కొందరు వ్యతిరేకంగా మరికొందరు ఇలా సామాజిక వర్గం లోనూ రెండుగా విడిపోయి సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టుకోవడమే కాదు ఏకంగా బహిరంగ విమర్శలు, చాలెంజ్ లు విసురుకోవడం ఇప్పుడు చర్చ గా మారింది. అంజూ యాదవ్. తానొక సిన్సియర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుకున్న ఫీలింగ్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ గా పనిచేస్తున్న ఆ పోలీస్ ఇన్స్ పెక్టర్ అలా దూకుడుగా వ్యవహరించి వారం రోజుల క్రితం జనసేన నేత చెంప చెల్లుమనిపించి వార్తల్లోకి ఎక్కింది. ఖాకీ యూనిఫామ్ వేసుకున్నప్పటి నుంచి డిఫరెంట్ స్టైల్ లో దూకుడు గానే విధులు నిర్వహిస్తూ వచ్చిన అంజూ యాదవ్ శ్రీకాళహస్తి ఇష్యూ తో మరింత పాపులర్ అయ్యింది. వరుస ఇన్సిడెంట్స్ లో సిఐ అంజూ దూకుడు డిపార్ట్మెంట్ లో కూడా చర్చ గా మారింది. ఇక ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే సీఐ అంజు యాదవ్ పై పిర్యాదు చేయడంతో ఆమె ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారంపై ఒకవైపు హెచ్ఆర్సీ నోటీసులు మరోవైపు పవన్ కళ్యాణ్ ఫిర్యాదులు తో కాక రేపుతున్న అంజు ఇష్యూ ఇప్పుడు కులంలో చిచ్చు రాజేస్తోంది.
పవన్‌పై బీసీ నాయకుల ఫైర్
సీఐ అంజూయాదవ్ పై చర్యలకు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడంతో వైసీపీ లోని బిసి నేతల నుంచి ఘాటుగానే కౌంటర్లు వచ్చాయి. మరో వైపు వైసీపీలోని యాదవ సామాజిక వర్గం నేతలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కౌంటర్లు ఇవ్వడం చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా కామెంట్స్ పొలిటికల్ హీట్ ను పెంచింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా పోలీసు అధికారి పై జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పిర్యాదు చేయడాన్ని కొన్ని సంఘాలు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టడంతో మూడు రోజులుగా రచ్చ మరింత రాజుకుంది. బిసి సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారిపై ఎస్పీ కి ఫిర్యాదు చేయడానికి 600 కిలోమీటర్లు నుంచి పవన్ కళ్యాణ్ రావడాన్ని తిరుపతిలో బిసి సంఘం నేతలు తప్పుపడుతున్నారు. లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ పరిజ్ఞానం ఇంతేనానని వైసీపీ కి చెందిన బిసి నేత బొమ్మగుంట రవి ప్రశ్నించారు. పవన్ ను నమ్మి ఎన్నికల్లో జనం నమ్మి ఓట్లేస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాష్ట్రంలో రక్షణ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు.
ధీటుగా జవాబిస్తోన్న జనసేన
చంద్రబాబు చెబితేనే అంజు యాదవ్ పై చర్యలకు డిమాండ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అలిపిరి ఘటనలో చంద్రబాబును కాపాడింది కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన అంజు యాదవ్ అన్న విషయం మరిచిపోవద్దని వైసీపీ నేతలు గుర్తు చేస్తుడటం చర్చగా మారుతోంది. ఇక అంజూ యాదవ్ కు మద్దతుగా నిలిచిన వైసీపీ లోని యాదవ సంఘాలు, మరి కొన్ని బీసీ సంఘాల నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో జనసేన ధీటుగానే సమాధానం ఇస్తోంది. జనసేన పార్టీలో ఉన్న యాదవ సామాజిక వర్గం నేతలు అంజూ యాదవ్ కు మద్దతు గా నిలిచిన వారికి చాలెంజ్ లు విసురుతున్నారు. జన సేనపార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళలను గౌరవించింది పవన్ పవన్ కళ్యాణ్ అని గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడితే తప్పుడు పోస్టింగులు పెడితే బట్టలు ఊడదీసీ కొడతామని వార్నింగ్ ఇస్తున్నారు జనసేన నేతలు. అంజుయాదవ్ ను వెనకేసువస్తున్న వైసిపి లోని యాదవ సామాజిక వర్గం నేతలు పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటిపై వైసీపీ కి చెందిన మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేసిన సమయంలో ఎందుకు ఖండించలేదని జనసేన జిల్లా కార్యదర్శి రాజేష్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..