Heavy Rain: వరదలో వదృతిలో ప్రాణాల మీదుకు తెచ్చుకున్న యువకుడు.. రక్షించిన స్థానికులు..

వరుణుడి ఉగ్రరూపానికి చిత్తూరు జిల్లా చిగురుటాగులా వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న కుండపోత వర్షానికి చిత్తూరు జిల్లాలోని..

Heavy Rain: వరదలో వదృతిలో ప్రాణాల మీదుకు తెచ్చుకున్న యువకుడు.. రక్షించిన స్థానికులు..
Locals Rescue A Young Man
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 18, 2021 | 9:59 PM

ఏపీలో వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. వరుణుడి ఉగ్రరూపానికి చిత్తూరు జిల్లా చిగురుటాగులా వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న కుండపోత వర్షానికి చిత్తూరు జిల్లాలోని గ్రామాలు వర్షం నీటిలో విలవిల్లాడిపోతున్నాయి. రహదారులన్నీ కాలువల్లా మారితే, వీధులు వాగులను తలపిస్తున్నాయి. శ్రీకాళహస్తిలోనూ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయ్. శ్రీకాళహస్తి వాగు పొంగడంతో మేకల మంద వరదలో చిక్కుకుని విలవిల్లాడాయి. వర్ష బీభత్సానికి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్ హరినారాయణన్.

అయితే అధికారులు హెచ్చరిస్తున్న కొందరు సహాసాలు చేస్తున్నారు. భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులను దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రాణాల మీదికి తెచ్చకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి చిత్తూ జిల్లా వెదురుకుప్పం మండలంలో చోటు చేసుకుంది. దేవర గుడి పల్లి వద్ద పొంగి ప్రవహిస్తున్న వాగు దాటేందుకు  ఓ యువకుడు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆటోతో కలిసి వాగును దాటేందుకు ప్రయత్నిస్తుండగా ద్విచక్ర వాహనంతో పాటు కొట్టుకుపోయాడు. ఇది గమనించిన స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే యువకుడు ఓ చెట్టు ని పట్టుకోవడంతో స్థానికులు అతన్ని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు.

మరో రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి: CM Jagan: కుప్పం ఎఫెక్ట్‌‌తో అసెంబ్లీకి రాలేదేమో.. చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు..

ఒక్క స్ట్రోక్‌తో కోటీశ్వరులైన మదుపరులు.. గతేడాది రూ. 12 పెట్టుబడి పెడితే ఇప్పుడెంతో తెలుసా?