Tirumala Heavy Rains: తిరుమలలో కనీవినీ ఎరుగని జలప్రళయం.. కనుమదారులు మూసివేత
కనీవినీ ఎరుగని జలప్రళయం. తిరుమలలో ఇంతకు ముందెన్నడూ చూడని జల విలయం. ఎటుచూసినా జల బీభత్సం. ఎక్కడ చూసినా భయానక దృశ్యాలే.
అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలిపిరి నడకమార్గం, కనుమదారుల్లో వరద నీరు పొంగిపొర్లుతోంది. ఇది కనీవినీ ఎరుగని జలప్రళయం. తిరుమలలో ఇంతకు ముందెన్నడూ చూడని జల విలయం. ఎటుచూసినా జల బీభత్సం. ఎక్కడ చూసినా భయానక దృశ్యాలే. తిరుమల ఏడుకొండలు కకావికలం. కనుచూపు మేర అల్లకల్లోలం. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షిగా తిరుమలలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. తిరుమల ఘాట్ రోడ్డులు మొదలు…. టెంపుల్ వరకు ఎక్కడ చూసినా బీభత్సమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఏడుకొండలు మొత్తం నీట మునిగాయ్. శ్రీవారి మాఢ వీధులు చెరువుల్ని తలపిస్తున్నాయ్.
ఘాట్ రోడ్డులైతే అత్యంత భయానకంగా మారాయి. ఘాట్ రోడ్లలో ఎక్కడికక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయ్. పెద్దపెద్ద వృక్షాలే నేలకూలిపోతున్నాయి. ఘాట్ రోడ్లలో పరిస్థితిని చూస్తే ఎప్పుడు ఏ బండ రాయి మీద పడుతుందో తెలియనంతగా వరద బీభత్సం కొనసాగుతోంది.
తిరుమల టెంపుల్ మొత్తం నీట మునిగింది. రోడ్లన్నీ కాలువల్లా మారిపోయాయ్. అసలు, ఎక్కడ రోడ్డు ఉందో… ఎక్కడ ఏది ఉందో కూడా గుర్తించలేనంతగా తిరుమలను వరద నీరు ముంచెత్తింది. క్యూకాంప్లెక్సులు మొత్తం నీట మునిగిపోయాయి.
అటవీప్రాంతం భారీగా వస్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. నీటి ప్రవాహంతో మెట్లమార్గం జలపాతంలా కనిపిస్తున్నది. ఇప్పటికే ముందు జాగ్రత్తలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం నడకదారిని మూసివేసింది. వర్షంతో రెండో కనుమదారిలో వాహనాలు నిలిచిపోయాయి.
ఇవి కూడా చదవండి: CM Jagan: కుప్పం ఎఫెక్ట్‌తో అసెంబ్లీకి రాలేదేమో.. చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు..
ఒక్క స్ట్రోక్‌తో కోటీశ్వరులైన మదుపరులు.. గతేడాది రూ. 12 పెట్టుబడి పెడితే ఇప్పుడెంతో తెలుసా?