CM Jagan: కుప్పం ఎఫెక్ట్‌తో అసెంబ్లీకి రాలేదేమో.. చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు..
కుప్పం ఎఫెక్ట్ వల్లే చంద్రబాబు అసెంబ్లీకి రాలేదేమోనని సెటైర్లు వేశారు సీఎం జగన్. బాబుగారు కూడా ఈవేళ అసెంబ్లీకి వస్తే బాగుండేది అద్యక్షా...! కానీ ఏమైందో ఏమో ఆయన రాలేదు అద్యక్షా..!
CM Jagan satire on Chandrababu: కుప్పం ఎఫెక్ట్ వల్లే చంద్రబాబు అసెంబ్లీకి రాలేదేమోనని సెటైర్లు వేశారు సీఎం జగన్. బాబుగారు కూడా ఈవేళ అసెంబ్లీకి వస్తే బాగుండేది అద్యక్షా…! కానీ ఏమైందో ఏమో ఆయన రాలేదు అద్యక్షా..! నిన్నటి కుప్పం దెబ్బకు కోలుకోలేదని మావాళ్ళంతా అంటున్నారు అద్యక్షా..! అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవ్వులు పూయించారు. రాజకీయాలకు తావులేకుండా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారతపై చర్చలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మహిళా సాధికారతపై చర్చకు చంద్రబాబు వస్తారేమో అని చాలా సేపు చూశాము కానీ రాలేదు. ఆలస్యం చేసినా ఇంతవరకు రాలేదు.. కుప్పం ఎఫెక్ట్‌తో చంద్రబాబు రాలేదని మావాళ్లు అంటున్నారు అనడంతో సభ ఒక్కసారిగా గొల్లుమంది.
అక్కాచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వం తమదని గుర్తు చేశారు సీఎం జగన్. అమ్మ ఒడి పథకం ద్వారా వారికి అండగా నిలుస్తున్నాం. రాష్ట్రంలో 61 లక్షా 73 వేల పెన్షన్లు అందిస్తున్నాం. అందులో 36 లక్షల 70వేల మంది మహిళలకు పెన్షన్ ఇస్తున్పాం. నెలకు రూ. 1500 కోట్లకు పైగా పెన్షన్లకు ఖర్చు చేస్తున్నాం. సూర్యోదయం కంటే ముందే పెన్షన్లు అందిస్తున్నాం. గతంలో ఎన్నికలకు ముందే పథకాలు అమలయ్యాయి.
ఇవి కూడా చదవండి: Rice in Telangana: బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోం.. ఎందుకో వివరించిన కేంద్రం