Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP MPTC ZPTC Elections Results: టీడీపీ కంచుకోటకు బీటలు.. పరిషత్‌ ఎన్నికల్లోనూ వైసీపీ సత్తా..

పరిషత్‌ ఎన్నికల్లోనూ వైసీపీ సత్తా చాటింది. మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీకి కంచుకోట లాంటి స్థానాల్లో కూడా వైసీపీ జెండా ఎగురవేసింది.

AP MPTC ZPTC Elections Results: టీడీపీ కంచుకోటకు బీటలు.. పరిషత్‌ ఎన్నికల్లోనూ వైసీపీ సత్తా..
Ap Mptc Zptc Elections 2021
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 18, 2021 | 7:07 PM

AP MPTC ZPTC Elections Results: పరిషత్‌ ఎన్నికల్లోనూ వైసీపీ సత్తా చాటింది. మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీకి కంచుకోట లాంటి స్థానాల్లో కూడా వైసీపీ జెండా ఎగురవేసింది. ఏపీలో వెలువడిన పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల కోసం జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. కృష్ణా జిల్లా విస్సన్నపేట, పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది వైసీపీ. పెనుగొండలో వైసీపీ అభ్యర్థి పొడూరి గోవర్థని 4401 ఓట్ల తేడాతో గెలుపొందారు. టీడీపీకి కంచుకోట లాంటి పెనుగొండలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది.

అయితే శ్రీకాకుళం జిల్లా హీర మండలంలోని జెడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టిడిపి అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు 59 ఓట్ల మెజార్టీతో గెలినట్లు ప్రకటించారు ఆర్వో. దీంతో రీ కౌంటింగ్ చేయాలని పట్టుబట్టారు వైసీపీ అభ్యర్థి శ్రావణ్ రెడ్డి. అధికారులు రీ కౌంటింగ్‌ చేపట్టగా, టిడిపి అభ్యర్థి గెలుపు వార్త తెలిసి కౌంటింగ్ కేంద్రం దగ్గరకు పెద్ద ఎత్తునా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.

అటు 123 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడం ఆ పార్టీకి కొంత ఊరట. శ్రీకాకుళం జిల్లాలోని హిర జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. ఇక్కడ టిడిపి అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు 59 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే మళ్లీ వైసీపీ కోసం అధికారులు రీ కౌంటింగ్‌ చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ సమయంలో కూడా వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి: CM Jagan: కుప్పం ఎఫెక్ట్‌‌తో అసెంబ్లీకి రాలేదేమో.. చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు..

ఒక్క స్ట్రోక్‌తో కోటీశ్వరులైన మదుపరులు.. గతేడాది రూ. 12 పెట్టుబడి పెడితే ఇప్పుడెంతో తెలుసా?

స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!
తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే.. వారిని తొలగించడం ఎలా..?
తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే.. వారిని తొలగించడం ఎలా..?
భార్య భర్తలు ఒకరికొకరు ఎలా శత్రువులుగా మారతారో తెలుసా..
భార్య భర్తలు ఒకరికొకరు ఎలా శత్రువులుగా మారతారో తెలుసా..
పుట్టింది హైదరాబాద్ ఏలేది బాలీవుడ్ ఈ చిన్నారులను గుర్తుపట్టగలరా
పుట్టింది హైదరాబాద్ ఏలేది బాలీవుడ్ ఈ చిన్నారులను గుర్తుపట్టగలరా
ఈ టాలీవుడ్ దర్శకుడిని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ హిట్టే..
ఈ టాలీవుడ్ దర్శకుడిని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ హిట్టే..
16 బంతుల్లో 44 రన్స్‌ చేస్తే.. పచ్చి బూతులు తిడుతున్నారు!
16 బంతుల్లో 44 రన్స్‌ చేస్తే.. పచ్చి బూతులు తిడుతున్నారు!
'నాగ్‌పూర్ అల్లర్లకు ఛావా సినిమానే కారణం'.. నటి సంచలన ట్వీట్!
'నాగ్‌పూర్ అల్లర్లకు ఛావా సినిమానే కారణం'.. నటి సంచలన ట్వీట్!