Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP MPTC ZPTC Elections Result Updates: పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ సత్తా.. మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను కైవసం..

AP MPTC ZPTC Polls Result: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మున్సిపల్‌, మొన్న పంచాయత్‌ ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయింది. స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లోనూ అధికార పార్టీ వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఇక ఇవాళ పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది.

AP MPTC ZPTC Elections Result Updates: పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ సత్తా.. మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను కైవసం..
Ap Mptc Zptc Elections Result
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 18, 2021 | 8:48 PM

AP MPTC ZPTC Elections Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మున్సిపల్‌, మొన్న పంచాయత్‌ ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయింది. స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లోనూ అధికార పార్టీ వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఇక ఇవాళ పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల అధికారులు ప్రారంభించారు. మరికాసేపట్లోనే ఫలితాలు వెలువడుతాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

రాష్ట్రంలో మంగళవారం ఎన్నికలు జరిగిన 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను గురువారం లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 14 జడ్పీటీసీల్లో 04 ఏకగ్రీవం కాగా.. 10 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. 176 ఎంపీటీసీ స్థానాల్లో 50 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు ఎన్నికల సిబ్బంది. ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు ఉదయం పది గంటలకు తేలతాయని, జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

వీటితోపాటు సెప్టెంబరు 19న రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల సమయంలో కేవలం రెండు పోలింగ్‌ బూత్‌లలో ఓట్ల లెక్కింపునకు వీలులేని పరిస్థితిలో ఫలితం ప్రకటన వాయిదాపడింది. కడప జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానం విజేత ఎవరో కూడా ఇవాళ తేలనుంది. ఈ జెడ్పీటీసీ స్థానంలో లెక్కింపు జరిగినంతవరకు వైసీపీ అభ్యర్థి.. ఆ తర్వాత స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి కంటే 517 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆ జెడ్పీటీసీ స్థానం పరిధిలోని గొరిగనూరు ఎంపీటీసీ స్థానంలో మొత్తం 827 మంది ఓటర్లున్న రెండు పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్లు తడిసి లెక్కింపునకు వీలుగా లేవని అప్పట్లో కౌంటింగ్‌ సిబ్బంది తేల్చారు. దీంతో కౌంటింగ్ నిలిచిపోయింది. కాగా, ఇవాళ ఆ స్థానానికి సంబంధించి లెక్కింపు ప్రక్రియను అధికారులు ఇవాళ చేపట్టారు. అలాగే, అప్పట్లో ఓట్లు తడిసిన కారణంగా ఆరు ఎంపీటీసీ స్థానాల ఫలితాల ప్రకటనను వాయిదావేశారు. రీ పోలింగ్‌ నిర్వహించడంతో ఆ ఆరు ఎంపీటీసీ స్థానాల ఫలితాలు కూడా గురువారం తేలనున్నాయి.

ఇక, చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం జడ్పీటీసీతో పాటు గుడిపాల, గుడుపల్లె, కేవీపల్లె, కుప్పం, నగరి, ఎస్‌ఆర్‌పురం, శాంతిపురం మండలాల్లోని 8 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి గురువారం ఆయా ప్రాంతాల్లో జరిగే కౌంటింగ్‌కు 30 టేబుల్స్‌ ఏర్పాట్లు చేయగా, 142 మంది సిబ్బందిని కౌంటింగ్‌కు నియమించినట్టు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. బంగారుపాళ్యం జడ్పీ హైస్కూల్‌లో కౌంటింగ్‌కు 14 టేబుల్స్‌ ఏర్పాటు చేయగా, 67 మంది సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. ఎంపీటీసీ స్థానాల కౌంటింగ్‌ ఆయా ఎంపీడీవో కార్యాలయాల్లో జరుగుతాయన్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అన్ని జిల్లా పరిషత్ సీఈవో ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూం ఏర్పాట్లు చేశారు.