Petrol And Diesel Price: వాహనదారులకు ఇది నిజంగానే ఊరట.. వరుసగా 14వ రోజు స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

Petrol And Diesel Price: ఒకప్పుడు ఆకాశమే హద్దుగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు కళ్లెం పడింది. ఒకానొక సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ. 120కి చేరువైన లీటర్‌ పెట్రోల్‌ ధర ఇప్పుడు కాస్త తగ్గింది. కేంద్ర ప్రభుత్వం..

Petrol And Diesel Price: వాహనదారులకు ఇది నిజంగానే ఊరట.. వరుసగా 14వ రోజు స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..
Fuel Price
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 18, 2021 | 9:00 AM

Petrol And Diesel Price: ఒకప్పుడు ఆకాశమే హద్దుగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు కళ్లెం పడింది. ఒకానొక సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ. 120కి చేరువైన లీటర్‌ పెట్రోల్‌ ధర ఇప్పుడు కాస్త తగ్గింది. కేంద్ర ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.5 , డీజిల్‌ పై రూ. 10 తగ్గించడంతో పెట్రో మంటలు చల్లబడ్డాయి. ఇక మరికొన్ని రాష్ట్రాలు కేంద్రానికి మద్ధతుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గత కొన్నిరోజులుగా డీజిల్‌, పెట్రోల్‌ ధరల్లో మార్పులు లేకపోవడం ఇదే తొలిసారి అని చెప్పాలి. ఏకంగా 14వ రోజు కూడా ధరల్లో పెరుగుదల కనిపించలేదు. గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 103.97 గా ఉంది, లీటర్‌ డీజిల్‌ రూ. 88.67 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109.98 గా ఉండగా, డీజిల్‌ రూ. 94.14 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో గురువారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 101.56 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 91.58 గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 100.58 గా ఉండగా, డీజిల్‌ రూ. 85.01వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో గురువారం లీట్‌ పెట్రోల్‌ రూ. 108.20గా ఉంది, ఇక డీజిల్‌ రూ. 94.62 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110.51 వద్ద ఉండగా, డీజిల్‌ ధర రూ. 96.59 గా ఉంది.

* సాగర నగరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.90 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ ధర రూ. 95.57 గా నమోదైంది.

Also Read: Venkatesh Daggubati: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సీనియర్ హీరో.. వెంకీ మామ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనేనా..

Venkatesh Daggubati: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సీనియర్ హీరో.. వెంకీ మామ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనేనా..

Suryakumar Yadav: తన భార్య పుట్టిన రోజున ఇచ్చిన బహుమతి అది.. క్యాచ్ మిస్‎పై సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..