Venkatesh Daggubati: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సీనియర్ హీరో.. వెంకీ మామ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనేనా..

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి కుర్రహీరోలకు పోటీగా నిలుస్తున్నారు

Venkatesh Daggubati: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సీనియర్ హీరో.. వెంకీ మామ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనేనా..
Venky
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 18, 2021 | 7:26 AM

Venkatesh Daggubati: సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టి కుర్రహీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఇప్పటికే నారప్ప సినిమాతో మంచి విజయం అందుకున్న వెంకీ. ఇక ఇప్పుడు దృశ్యం 2 సినిమాతో రెడీ అవుతున్నాడు. ‘అసురన్’ రీమేక్‌గా వచ్చిన నారప్ప సినిమాలో వెంకీ తన నటనతో కట్టిపడేసారు. మలయాళంలో విజయం సాధించిన దృశ్యం 2 సినిమాను తెలుగులో వెంకీ రీమేక్ చేస్తున్నారు. అంతకు ముందు దృశ్యం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు వెంకీ. ఈ సినిమా గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్‌గా రానుంది. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనీ చూస్తున్నారు.

ఇక వెంకటేష్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో వెంకీ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారని ఆ మధ్య వార్తలు తెగ వినిపించాయి. అంతే కాదు డైరెక్టర్ తేజ డైరెక్షన్లో ఒకటి, పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో ఓ సినిమా చేయనున్నాడని రూమర్స్ వచ్చాయి. అయితే వెంకటేష్ రానా తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మద్యే ఈ వెబ్ సిరీస్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ కు రీమేక్ గా రూపొందుతోంది. ఈ సిరీస్ కు ‘మీర్జాపూర్’ ఫేమ్ కరణ్ అన్షుమన్ మరియు సుప్రన్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ తర్వాత వెంకీ ఏ దర్శకుడితో సినిమా చేస్తారో అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈవిషయం పై క్లారిటీ వస్తుందేమో చూడాలి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Priyamani: ఎర్రచీరలో ప్రియమణి అదిరేటి అందాలు.. కుర్రాళ్ల మతులు పోవాల్సిందే.! వైరల్ పిక్స్!

Madonna Sebastian: అందాల సోయగం మడోన్నా సెబాస్టియన్ సొగసు చూడతరమా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..

Jai Bhim: సూర్య సినిమా ఆస్కార్‌ అందుకుంటుంది.. జై భీమ్‌పై ఎమ్మెల్యే సీతక్క ట్వీట్‌..