RRR Movie: ఇండియన్ హిస్టరీలో ఏ సినిమాకు దక్కని రికార్డ్ పై కన్నేసిన ఆర్ఆర్ఆర్.. అదేంటంటే

రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి నెలకొంటుంది. ఆయనతో సినిమా చేయాలని చిన్న హీరోలనుంచి పెద్దహీరోల వరకు అందరు ఎదురుచూస్తుంటారు.

RRR Movie: ఇండియన్ హిస్టరీలో ఏ సినిమాకు దక్కని రికార్డ్ పై కన్నేసిన ఆర్ఆర్ఆర్.. అదేంటంటే
Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 18, 2021 | 7:49 AM

RRR Movie: రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి నెలకొంటుంది. ఆయనతో సినిమా చేయాలని చిన్న హీరోల నుంచి పెద్దహీరోల వరకు అందరు ఎదురుచూస్తుంటారు. ఇక ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను అలర్ట్ చేసింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ప్రేక్షకులంతా ఉవ్విళ్లూరుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలాగే తారక్ గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు, పాటలు సినిమా పై ఆసక్తిని అమాంతం పెంచాయి.

యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2022 జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటివరకు క్రియేట్ చేయని సరికొత్త రికార్డును సొంతం చేసుకోబోతుందని అంటున్నారు. అదేంటంటే ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10000 స్క్రీన్లలో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీతో పాటుగా పలు విదేశీ భాషల్లో విడుదల కానుంది. యూఎస్ఏలోనే సుమారు 2500 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ – సముద్ర ఖని – శ్రియా – రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Rashi Khanna: సౌత్‌లోనే కాదు.. నార్త్‌లోనూ జోరు మీదున్న అందాల రాశీ.. మరో భారీ చిత్రంలో నటించే ఛాన్స్‌..

Venkatesh Daggubati: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సీనియర్ హీరో.. వెంకీ మామ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనేనా..

Nandamuri Balakrishna: ఆ స్టార్ దర్శకుడితో బాలయ్య మల్టీస్టారర్ సినిమా చేయనున్నారా..?