Nandamuri Balakrishna: ఆ స్టార్ దర్శకుడితో బాలయ్య మల్టీస్టారర్ సినిమా చేయనున్నారా..?

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా పూర్తి చేసి నెక్స్ట్ సినిమాకు సిద్ధంగా ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతుంది.

Nandamuri Balakrishna: ఆ స్టార్ దర్శకుడితో బాలయ్య మల్టీస్టారర్ సినిమా చేయనున్నారా..?
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 18, 2021 | 7:03 AM

Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా పూర్తి చేసి నెక్స్ట్ సినిమాకు సిద్ధంగా ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్ , సాంగ్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక బోయపాటి  బాలయ్య కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో సింహ , లెజెండ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఇటీవలే క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న గోపిచంద్ బాలయ్య కోసం అదిరిపోయే స్టోరీని సిద్ధం చేశారు. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక బాలయ్యతో సినిమా చేయాలనీ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. గోపీచంద్ సినిమా తర్వాత అనీల్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో దర్శకుడి పేరు కూడా వినిపిస్తుంది. ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటితో సూపర్ హిట్స్ అందుకున్న కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఓ మల్టీస్టారర్ కథ అని అంటున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాతో సిద్ధంగా ఉన్న కొరటాల ఆ తర్వాత తారక్ తో సినిమా చేయనున్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్యతో సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఈవార్తల్లో నిజమంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Priyamani: ఎర్రచీరలో ప్రియమణి అదిరేటి అందాలు.. కుర్రాళ్ల మతులు పోవాల్సిందే.! వైరల్ పిక్స్!

Madonna Sebastian: అందాల సోయగం మడోన్నా సెబాస్టియన్ సొగసు చూడతరమా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..

Jai Bhim: సూర్య సినిమా ఆస్కార్‌ అందుకుంటుంది.. జై భీమ్‌పై ఎమ్మెల్యే సీతక్క ట్వీట్‌..