AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjuna Phalguna: మరో ఇంట్రస్టింగ్ కథతో రానున్న శ్రీవిష్ణు.. ఆకట్టుకుంటున్న అర్జున ఫల్గుణ పాట..

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.

Arjuna Phalguna: మరో ఇంట్రస్టింగ్ కథతో రానున్న శ్రీవిష్ణు.. ఆకట్టుకుంటున్న అర్జున ఫల్గుణ పాట..
Sri Vishnu
Rajeev Rayala
|

Updated on: Nov 18, 2021 | 8:01 AM

Share

Arjuna Phalguna: కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి అర్జున ఫల్గుణ అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. అర్జున ఫల్గుణ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఓ పాట అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు కాపాడేవా రాపాడేవా? అంటూ సాగే మరో పాటను విడుదల చేశారు. ఈ పాట ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని అంటున్నారు చిత్రయూనిట్. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ ఈ పాటకు అద్భుతమైన బాణీని ఇచ్చారు. ఈ పాటలో శ్రీ విష్ణు అతని స్నేహితులు, అమృతా అయ్యర్ అందరూ కనిపిస్తున్నారు. చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం ఎంతో పవర్ ఫుల్‌గా ఉన్నాయి. మోహన భోగరాజు గాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.

టీజర్, ఫస్ట్ సింగిల్‌కు విశేషమైన స్పందన రాగా.. ఈ రెండో పాట కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాట పై మీరూ ఓ లుక్కెయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashi Khanna: సౌత్‌లోనే కాదు.. నార్త్‌లోనూ జోరు మీదున్న అందాల రాశీ.. మరో భారీ చిత్రంలో నటించే ఛాన్స్‌..

Venkatesh Daggubati: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సీనియర్ హీరో.. వెంకీ మామ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనేనా..

Nandamuri Balakrishna: ఆ స్టార్ దర్శకుడితో బాలయ్య మల్టీస్టారర్ సినిమా చేయనున్నారా..?

రేపే చంద్ర సంచారం.. వీరు జాగ్రత్త ఉండకపోతే ముప్పు తిప్పలు తప్పవు!
రేపే చంద్ర సంచారం.. వీరు జాగ్రత్త ఉండకపోతే ముప్పు తిప్పలు తప్పవు!
సిరీస్ మొత్తం అవే.. ఒంటరిగా చూడాల్సిందే
సిరీస్ మొత్తం అవే.. ఒంటరిగా చూడాల్సిందే
ఆచితూచి తిన్నా బరువు పెరుగుతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..
ఆచితూచి తిన్నా బరువు పెరుగుతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..
శివరాత్రి రోజున అస్సలే చేయకూడని తప్పులు ఇవే!
శివరాత్రి రోజున అస్సలే చేయకూడని తప్పులు ఇవే!
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
పార్వతీదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
పార్వతీదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే.. ఇది తెలిస్తే ఇంకేం తినరు..
మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే.. ఇది తెలిస్తే ఇంకేం తినరు..
ఏటీఎం చోరీకి వచ్చి అడ్డంగా బుక్కైన దొంగ.. అతను ఎవరో తెలిసి..
ఏటీఎం చోరీకి వచ్చి అడ్డంగా బుక్కైన దొంగ.. అతను ఎవరో తెలిసి..
ప్రెగ్నెంట్‌ సమయంలో మహిళలను ఎందుకని పాము కాటు వేయదు?
ప్రెగ్నెంట్‌ సమయంలో మహిళలను ఎందుకని పాము కాటు వేయదు?
ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్నారు..
ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్నారు..