Rashi Khanna: సౌత్‌లోనే కాదు.. నార్త్‌లోనూ జోరు మీదున్న అందాల రాశీ.. మరో భారీ చిత్రంలో నటించే ఛాన్స్‌..

Rashi Khanna: సౌత్‌ ఇండియాలో కాస్త పాపులారిటీ సంపాదించుకోగానే నటీమణుల టార్గెట్‌ బాలీవుడ్‌. తెలుగు, తమిళ సినిమాల్లో రాణించగానే బాలీవుడ్‌ బాటపడుతున్నారు నటీమణులు. ఈ ట్రెండ్‌ ఇటీవల..

Rashi Khanna: సౌత్‌లోనే కాదు.. నార్త్‌లోనూ జోరు మీదున్న అందాల రాశీ.. మరో భారీ చిత్రంలో నటించే ఛాన్స్‌..
నిజానికి బాలీవుడ్ లో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రారంభమై ఆ తర్వాత నేరుగా అవసరాల శ్రీనివాస్ అవకాశం ఇవ్వడంతో ఇక్కడ హీరోయిన్ గా మారింది.
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 18, 2021 | 7:32 AM

Rashi Khanna: సౌత్‌ ఇండియాలో కాస్త పాపులారిటీ సంపాదించుకోగానే నటీమణుల టార్గెట్‌ బాలీవుడ్‌. తెలుగు, తమిళ సినిమాల్లో రాణించగానే బాలీవుడ్‌ బాటపడుతున్నారు నటీమణులు. ఈ ట్రెండ్‌ ఇటీవల మరీ ఎక్కువుతోంది. తమన్నా, కాజల్‌, పూజా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దదేనని చెప్పాలి. అయితే తాజాగా ఈ జాబితాలో అందాల తార రాశీ ఖన్నా వచ్చి చేరారు. తెలుగు, తమిళంలో బిజీగా హీరోయిన్‌గా మారిన తర్వాత రాశీ ఖన్నా తన టార్గెట్‌ను బీటౌన్‌కు మార్చింది. ఈ క్రమంలోనే వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.

రాశీ ఖన్నా ఇప్పటికే హిందీలో రెండు వెబ్‌ సిరీస్‌లలో నటిస్తోన్న విషయం తెలిసిందే. వీటిలో ‘సన్నీ’ ఒకటి కాగా, మరొకటి అజయ్‌ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘రుద్ర’. ఇదిలా ఉంటే ఈ రెండు వెబ్‌ సిరీస్‌లు ఇంకా విడుదలవ్వక ముందే రాశీ ఖన్నా మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా, దిశా పటానీ లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న ఈ సినిమాకు ‘యోధ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పుష్కర్‌ ఓజా అనే కొత్త డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీని నటింపజేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే మాత్రం రాశీ ఖన్నాకు బాలీవుడ్‌లో బ్రేక్‌ వచ్చినట్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే రాశీ ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘పక్కా కమర్షియల్‌’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’తో పాటు తమిళంలో  కార్తీ సరసన ‘సర్దార్‌’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌కు తనకు మధ్య ఏముందో చెప్పేసిన సిరి..చెప్తూ తెగ సిగ్గుపడిందిగా..

పెళ్లి దుస్తులు కొనేందుకు షాప్‌కి వెళుతున్నారా..! ఈ 4 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తాజాగా సిల్వర్‌ ధర ఎంతుందంటే..?