Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి దుస్తులు కొనేందుకు షాప్‌కి వెళుతున్నారా..! ఈ 4 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..

Wedding Dresses: కార్తీక మాసంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం ఎవరి ఇంట్లోనైనా పెళ్లి వేడుక ఉన్నా లేదా బంధువులలో ఉన్నా పెళ్లి దుస్తుల కోసం షాప్‌కి వెళ్లడం తప్పదు.

పెళ్లి దుస్తులు కొనేందుకు షాప్‌కి వెళుతున్నారా..! ఈ 4 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..
Wedding
Follow us
uppula Raju

|

Updated on: Nov 18, 2021 | 6:02 AM

Wedding Dresses: కార్తీక మాసంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం ఎవరి ఇంట్లోనైనా పెళ్లి వేడుక ఉన్నా లేదా బంధువులలో ఉన్నా పెళ్లి దుస్తుల కోసం షాప్‌కి వెళ్లడం తప్పదు. ఇలాంటి సమయంలో షాపింగ్ చేయడం చాలా కష్టమైన పని. అంతేకాదు పెళ్లి రోజు వరకు ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. అయితే వెడ్డింగ్ ఫంక్షన్‌లో ధరించే దుస్తుల గురించి చాలామంది ఎక్కువగా ఆలోచిస్తారు. పర్ఫెక్ట్‌గా ఉండాలని చూస్తారు. ముఖ్యంగా పెళ్లి షాపింగ్‌లో అమ్మాయిలు అత్యుత్తమ దుస్తులను కొనుగోలు చేయాలని కోరుకుంటారు అది కూడా పరిమిత బడ్జెట్‌లో. అటువంటి పరిస్థితిలో చాలా మంది వధువులు ఆన్‌లైన్ నుంచి ఆఫ్‌లైన్ వరకు చాలా ప్రదేశాలలో దుస్తులను వెతుకుతారు. ఒక్కోసారి ఏదైనా తీసుకున్నా మనసులో సంతృప్తి ఉండదు. కాబట్టి దుస్తులను కొనుగోలు చేసేటప్పుడు ఏయే అంశాలను గుర్తుంచుకోవాలి అనేది తెలుసుకుందాం.

1. కుటుంబ సభ్యులు

అమ్మాయిలు పెళ్లి షాపింగ్ చేసినప్పుడు వారితో ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. దీని కారణంగా చాలా సార్లు ఆమె సరైన దుస్తులను కొనుగోలు చేయలేకపోతుంది. దీనికి కారణం దుస్తులపై అందరి అభిప్రాయమే. అటువంటి పరిస్థితిలో మీరు షాపింగ్‌కు వెళ్ళినప్పుడు తక్కువ మందిని తీసుకెళ్లండి. అప్పుడు ఎటువంటి గందరగోళానికి గురికాలేరు.

2. సరైన సమయం వివాహ దుస్తులను కొనుగోలు చేయడానికి సరైన సమయం ముఖ్యం. చాలా సార్లు అమ్మాయిలు పెళ్లికి ముందే దుస్తులను కొనుగోలు చేస్తారు. తరువాత సంతృప్తి చెందక బాధపడుతారు. ఇదిలా ఉంటే కొన్నిసార్లు షాపింగ్ ఆలస్యం కావడం వల్ల ఫిట్టింగ్‌లు చేసుకునేందుకు కూడా సమయం దొరకదు. కాబట్టి సరైన సమయంలో పెళ్లి షాపింగ్ చేయాలి.

3. ఆన్‌లైన్‌లో వెతకాలి మీరు సరైన దుస్తుల కోసం ఆన్‌లైన్‌లో వెతకాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి ముందు ఆన్‌లైన్ పరిశోధన చేయాలి. ఆన్‌లైన్ శోధన మీకు తాజా ట్రెండ్‌లు, దుస్తుల ధరల గురించి తెలియజేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆఫ్‌లైన్ షాపింగ్‌ సులభతరం అవుతుంది.

4. బడ్జెట్ సెట్ మీరు వెడ్డింగ్ షాపింగ్‌కి వెళుతున్నప్పుడు ముందుగా మీ బడ్జెట్‌ను నిర్ణయించుకోండి. దీంతో మీరు అనవసరమైన ఖర్చులను సులభంగా నివారించవచ్చు. షాపింగ్ చేసేటప్పుడు మీ బడ్జెట్‌లో లేని దుస్తుల జోలికి పోవద్దు. తద్వారా మీ జేబుపై భారం పడదు.

5. తక్కువ దుస్తులు మీరు పెళ్లి షాపింగ్‌కి వెళ్లినప్పుడు తెలియని దుస్తులు వెతకకండి. వాటివల్ల మీ మనసు కలవరపడుతుంది. దీని కారణంగా చాలా సార్లు సరైన వివాహ దుస్తులను కొనుగోలు చేయకపోవచ్చు. మీరు ఎక్కువగా ఇష్టపడే దుస్తులపై దృష్టి పెడితే మంచిది.

విటమిన్‌ ‘E’ లేకుంటే శరీరంలో ఈ రెండు పనిచేయవు..! అందుకే ఈ 5 ఆహారాలు తప్పనిసరి..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన 6 ఏళ్ల బాలిక.. ఏ విషయంలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

IND vs NZ: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం