Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oranges: ఈ వ్యాధి ఉన్నవారు ఆరెంజ్‌ పండ్ల జోలికి వెళ్లకూడదు..! ఎందుకో తెలుసా..?

Oranges: చలికాలం వచ్చిందంటే మార్కెట్‌లోకి సీజనల్‌ ఫ్రూట్స్‌, కూరగాయలు అధికంగా వస్తాయి. శీతాకాలంలో ఆకు కూరలు, తాజా పండ్లను తినడం వల్ల

Oranges: ఈ వ్యాధి ఉన్నవారు ఆరెంజ్‌ పండ్ల జోలికి వెళ్లకూడదు..! ఎందుకో తెలుసా..?
Orange
Follow us
uppula Raju

|

Updated on: Nov 18, 2021 | 5:59 AM

Oranges: చలికాలం వచ్చిందంటే మార్కెట్‌లోకి సీజనల్‌ ఫ్రూట్స్‌, కూరగాయలు అధికంగా వస్తాయి. శీతాకాలంలో ఆకు కూరలు, తాజా పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఈ సీజన్‌లో వచ్చే ప్రత్యేకమైన పండు నారింజ. శీతాకాలంలో నారింజకు డిమాండ్ గణనీయంగా ఉంటుంది. అంతేకాదు ఇది ఆరోగ్యనికి చాలా మంచిది. ఈ పండును ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నారింజ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అయితే ఈ పండును ఎక్కువగా తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.100 గ్రాముల నారింజలో 48 గ్రాముల కేలరీలు, 8 గ్రాముల నీరు, 0.9 గ్రాముల ప్రోటీన్, 11.6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 9.4 గ్రాముల చక్కెర, 2.4 గ్రాముల ఫైబర్, 6 శాతం విటమిన్ సి ఉంటాయి. నారింజ ఆరోగ్యకరమైన పండు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ పండును మితంగా తినాలి. రోజూ 4-5 నారింజ పండ్లను తినడం ప్రారంభిస్తే శరీరానికి ఎక్కువ పీచు లభిస్తుంది. దీని వల్ల కడుపులో నొప్పి, విరేచనాలు, కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఇలాంటి వారు నారింజ పండ్లను తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే గుండెల్లో మంట, వాంతులు, నిద్రలేమి, గుండెపోటుకు కారణమవుతుంది. నారింజ సహజంగా ఆమ్లంగా ఉంటుంది. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపు నొప్పి వస్తుంది. అదనంగా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారు నారింజ తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి. నారింజ ఎక్కువగా తినడం వల్ల వాంతులు,గుండెల్లో మంట వస్తుంది. రక్తంలో పొటాషియం ఎక్కువగా ఉన్నవారు నారింజను తినే ముందు వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.

IND vs NZ: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన 6 ఏళ్ల బాలిక.. ఏ విషయంలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

విటమిన్‌ ‘E’ లేకుంటే శరీరంలో ఈ రెండు పనిచేయవు..! అందుకే ఈ 5 ఆహారాలు తప్పనిసరి..