Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం ప్రేమ బాబోయ్‌..! కాబోయే అల్లుడితో ప్రేమలో పడిన అత్తగారు.. చివరకు ఏమైందంటే..?

Odd News: ప్రతి అమ్మాయి తన పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అది కూడా తన తల్లితండ్రుల కళ్ల ముందు జరగాలని కోరుకుంటుంది.

ఇదేం ప్రేమ బాబోయ్‌..! కాబోయే అల్లుడితో ప్రేమలో పడిన అత్తగారు.. చివరకు ఏమైందంటే..?
Mother
Follow us
uppula Raju

|

Updated on: Nov 18, 2021 | 6:05 AM

Odd News: ప్రతి అమ్మాయి తన పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అది కూడా తన తల్లితండ్రుల కళ్ల ముందు జరగాలని కోరుకుంటుంది. అయితే పెళ్లి రోజు అనేది అమ్మాయికి ఎంత ప్రత్యేకమైనదో ఆమె తల్లిదండ్రులకు కూడా అంతే ప్రత్యేకం. కూతురి పెళ్లికోసం ప్రతి తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. వైభవంగా చేయాలని అనుకుంటారు. అంతే కాదు తమ అల్లుడిని కొడుకులా భావిస్తారు. అల్లుడు కూడా అత్తమామలకు గౌరవం ఇవ్వడం మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. కానీ సొంత కూతురి పెళ్లిలో అల్లుడితో ప్రేమలో పడిన అత్తగారి లవ్‌ స్టోరీ గురించి మీకు తెలుసా..!

ఇప్పుడు సోషల్ మీడియాలో అత్తగారు, అల్లుడికి సంబంధించిన లవ్‌ స్టోరీ తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక మహిళ తన సొంత అల్లుడితో ప్రేమలో పడింది ఈ కారణంగా తన కుమార్తె పెళ్లికి వెళ్లడానికి నిరాకరించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంతేకాదు ఈ విషయాన్ని స్వయంగా పెళ్లి కూతురే సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరు వెడ్డింగ్‌బీ అనే పేజీలో ఈ స్టోరీ గురించి తెలుసుకోవచ్చు. ఈ విషయం గురించి వధువు మాట్లాడుతూ..

తనకు కాబోయే భర్తతో ప్రేమలో పడినందున తన తల్లి పెళ్లికి హాజరుకావడానికి నిరాకరించిందని తెలిపింది. దీంతో తాను ఆశ్చర్యపోయానని చెప్పింది. అంతేకాదు ఈ విషయాన్ని తన తల్లే తనకు చెప్పిందని వివరించింది. అయితే అల్లుడిపై ఉన్న భావాలన్నింటిని తప్పకుండా మార్చుకుంటానని సదరు మహిళ చెప్పడం గమనార్హం. ఈ విషయంపై నెటిజన్లు తెగా మండిపడుతున్నారు. ఇదేం లవ్‌స్టోరీ బాబోయ్‌ అంటూ కామెంట్ చేస్తున్నారు. కూతురికి కాబోయే భర్తిన ప్రేమించడం ఏంటని తిట్టిపోస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలని సూచించారు. అంతేకాదు అమాయకురాలైన కూతురిని మోసగించడం తగదన్నారు.

విటమిన్‌ ‘E’ లేకుంటే శరీరంలో ఈ రెండు పనిచేయవు..! అందుకే ఈ 5 ఆహారాలు తప్పనిసరి..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన 6 ఏళ్ల బాలిక.. ఏ విషయంలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

IND vs NZ: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం