Kangana Ranaut: బాలీవుడ్ నటి వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన.. జార్ఖండ్‌, బిహార్‌లలో దేశద్రోహం కేసులు నమోదు..

భారత స్వాతంత్ర్యోద్యమం, మహాత్మా గాంధీలపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది

Kangana Ranaut: బాలీవుడ్ నటి వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన.. జార్ఖండ్‌, బిహార్‌లలో దేశద్రోహం కేసులు నమోదు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 18, 2021 | 9:29 AM

భారత స్వాతంత్ర్యోద్యమం, మహాత్మా గాంధీలపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. తాజాగా కంగనా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జార్ఖండ్‌, బిహార్‌ రాష్ట్రాలలో ఆమెపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో నమోదైన కేసు నేడు విచారణకు రానుండగా, బిహార్‌లోని సహర్సలో నమోదైన కేసు ఈనెల 22న విచారణకు రానుంది. కొన్ని రోజుల ముందు భారత స్వాతంత్ర్యోద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా తాజాగా మహాత్మాగాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఒక చెంప చూపితే స్వాతంత్య్రం రాదని, భిక్ష మాత్రమే వస్తుందని.. స్వాతంత్ర్య వీరులు సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌కు గాంధీ మద్దతు లభించలేదని ఆమె వరుసగా ట్విట్టర్‌లో వరసగా పోస్ట్‌లు పెట్టారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో కలకలం సృష్టించాయి.

బీజేపీ నేతలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కంగనా వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కాగా ఆమె వ్యాఖ్యలతో దేశం పరువుకు నష్టం కలుగుతుందని, ఆమెపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని జార్ఖండ్‌లోని పండర్‌పాలా నివాసి ఇజార్‌ అహ్మద్‌ ధన్‌బాద్‌ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇది నేడు విచారణకు రానుంది. కాగా భారత స్వాతంత్ర్యోద్యమంపై నటి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నవంబర్‌ 13నే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని అతను తెలిపాడు. మరోవైపు బిహార్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కిషోర్‌ కుమార్‌ కూడా కంగనా వ్యాఖ్యలపై దేశద్రోహం సహర్స కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది ఈనెల 22న విచారణకు రానుంది.

Also Read:

Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌కు భారతీయ వంటకాలు రుచి చూపించిన లైగర్ టీమ్..

Arjuna Phalguna: మరో ఇంట్రస్టింగ్ కథతో రానున్న శ్రీవిష్ణు.. ఆకట్టుకుంటున్న అర్జున ఫల్గుణ పాట..

Mimi Chakraborty: ఫొటోలు డిలీట్‌ అయ్యాయని ఎంపీ ట్వీట్‌.. భిన్న రకాలుగా స్పందిస్తోన్న నెటిజన్లు..

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు