Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌కు భారతీయ వంటకాలు రుచి చూపించిన లైగర్ టీమ్..

విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్  లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు.

Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌కు భారతీయ వంటకాలు రుచి చూపించిన లైగర్ టీమ్..
Vijay Devarakonda
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 18, 2021 | 8:43 AM

Liger : విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్  లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. మైక్ టైసన్ ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడంతోనే అంచనాలు ఆకాశన్నంటాయి.తాజాగా అమెరికాలో ప్రారంభించిన కొత్త షెడ్యూల్‌లో మైక్ టైసన్ జాయిన్ అయ్యారు. మైక్ టైసన్‌ సింప్లిసిటీ చూసి విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లతో పాటు చిత్రయూనిట్ అంతా కూడా ఆశ్చర్యపోయింది. అంతే కాదు మైక్ టైసన్ మన భారతీయ వంటకాలను రుచిచూపించారట. ఆయనకు అవి చాలా బాగా నచ్చాయట. ఆయనకు ఎంతో ఇష్టమైన వంటకాల గురించి అడిగి తెలుసుకున్నారట మైక్. అంతే కాదు ఆయన భార్య కోసం స్పెషల్‌గా భోజన ఏర్పాటు చేసింది లైగర్ టీం.

గార్లిక్ నాన్, బట‌ర్ చికెన్, తందూరి చికెన్, ఫిష్ టిక్కా మసాలా, గోట్ బిర్యానీ లాంటి స్పెషల్ ఐటమ్స్‌తో లంచ్ ఏర్పాటు చేశారు. ఆలూ గోబీ, పాలక్ పన్నీర్, సమోస, కబాబ్స్‌లను మైక్ టైసన్ స్పెషల్‌గా అడిగార‌ట‌. ఇండియన్ వంటకాల మీద టైసన్‌కు ఉన్న మక్కువ చూసి చిత్రయూనిట్ ఆశ్చర్యపోయింది. చిత్రయూనిట్ ప్రేమగా వడ్డించడం, అతిథి మర్యాదలను చూసి మైక్ టైసన్ ముచ్చటపడ్డారు. ఇక సెట్స్ మీద మైక్ టైసన్ సంపూర్ణ సహాకారమందించారు. ఇటీవల విడుదల చేసిన మైక్ టైసన్, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, అనన్య పాండే, ఛార్మీలు కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌లోఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మైక్ టైసన్ రాకతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు కూడా మారిపోయాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి. థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందిస్తున్నారు. లైగర్ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashi Khanna: సౌత్‌లోనే కాదు.. నార్త్‌లోనూ జోరు మీదున్న అందాల రాశీ.. మరో భారీ చిత్రంలో నటించే ఛాన్స్‌..

Venkatesh Daggubati: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సీనియర్ హీరో.. వెంకీ మామ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనేనా..

Nandamuri Balakrishna: ఆ స్టార్ దర్శకుడితో బాలయ్య మల్టీస్టారర్ సినిమా చేయనున్నారా..?