Mimi Chakraborty: ఫొటోలు డిలీట్ అయ్యాయని ఎంపీ ట్వీట్.. భిన్న రకాలుగా స్పందిస్తోన్న నెటిజన్లు..
ప్రముఖ బెంగాల్ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రముఖ బెంగాల్ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఫోన్‌లోని 7వేల ఫొటోలు, 500 వీడియోలు మాయమయ్యాయంటూ ఆమె చేసిన పోస్ట్‌పై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. బాధ్యతగల ఎంపీ పదవిలో ఉండి.. ఫొటోల కోసం బాధపడుతున్నారా? అంటూ కొందరు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సినీ పరిశ్రమకు చెందిన మిమి చక్రవర్త ప్రస్తుతం జాదవ్‌పూర్ పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం ఆమె.. ‘నేను ఇష్టపడి దాచుకున్న 7 వేల ఫొటోలు, 500 వీడియోలు ఫోన్ గ్యాలరీ నుంచి డిలీట్ అయ్యాయి. వాటిని తిరిగి పొందేందుకు అన్ని విధాలా ప్రయత్నించాను. కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు నాకు గట్టిగా ఏడ్వాలనిపిస్తోంది. విచారంలో మునిగిపోయాను’ అంటూ యాపిల్ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్ 14 మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్-13ను మిమీ వాడుతున్నారని తెలిసింది..
నెటిజన్ల మిశ్రమ స్పందన.. కాగా ఈ ట్వీట్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వెల్లడైంది. కొందరు నెటిజన్లు డిలీట్ అయిన ఫొటోలను ‘ఐ క్లౌడ్’ నుంచి తిరిగి పొందవచ్చు’ అని ఆమె సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. కానీ మీరు మాత్రం బాధ్యతగల ఎంపీ పదవిలో ఉండి ఫొటోలు, వీడియోల కోసం ఇలా తాపత్రయ పడతారా? అని మరికొందరు ఘాటుగా స్పందించారు. ఫొటోలు, వీడియోలపై దృష్టి సారించే సమయాన్ని నియోజకవర్గ ప్రజలకు కేటాయించాలని ఇంకొందరు ఎంపీకి సూచించారు.
7000 pictures 500 videos All got deleted from gallery i don’t know what to do cry or cry out loud. PS: All methods to revive tried nd done didn’t help @Apple @iPhone_News I feel disgusted @AppleSupport
— Mimssi (@mimichakraborty) November 17, 2021
Also Read:
RRR Movie: ఇండియన్ హిస్టరీలో ఏ సినిమాకు దక్కని రికార్డ్ పై కన్నేసిన ఆర్ఆర్ఆర్.. అదేంటంటే