AP Government Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2190 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వివరాల్లోకి వెళ్తే..
AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి శుభవార్త వినిపించింది. వైద్య రంగంలో..
AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి శుభవార్త వినిపించింది. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ తాజాగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలున్న 2,190 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్‌లో 560 గ్రేడ్-2 ఫార్మసిస్ట్‌లతో పాటు వైద్యకళాశాలో 1952 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో 1285 ఉద్యోగాల అదనంగా మంజూరు చేసింది.
2190 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: ఆంధ్ర ప్రదేశ్ లోని 35 మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రులలో 2190 కొత్త పోస్టుల నియామకం చేపట్టనుంది. అంతేకాదు ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీచేశారు.
పోస్టుల ఖాళీల వివరాలు: * ప్రొఫెసర్లు- 51 * అసోసియేట్ ప్రొఫెసర్లు-187 * అసిస్టెంట్ ప్రొఫెసర్లు- 130 * నర్సింగ్ -1040 * పారామెడికల్ -782
కొత్తగా మంజూరైన పోస్టులతో ఏపీలో ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు పెరగనున్నాయి. ఈ పోస్టుల భర్తీతో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని అధికారులు చెప్పారు.
Also Read: రూ. 260 కోట్లకు అమ్ముడైన పెయింటింగ్.. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా..