AP Rains Alert: తీరం దాటిన వాయుగుండం.. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
AP Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నై తీరానికి దగ్గరలో ఉందని.. దీనివలన ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో వర్షాల తీవ్రత కూడ పెరుగుతుందని..
AP Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నై తీరానికి దగ్గరలో ఉందని.. దీనివలన ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో వర్షాల తీవ్రత కూడ పెరుగుతుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఈ వాయుగుండం ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య తీరాన్నిదాటింది. దీంతో చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో రానున్న రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అంతేకాదు ఈ జిల్లా వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని .. లోతట్టు ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లమని సూచించింది. మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
ఈ వాయుగుండం ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, కృష్ణా కోస్తా భాగాల్లో పాటు విశాఖపట్టణం, విజయనగరంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. తిరుమల వీడులతోపాటు తిరుపతిలోని అనేక ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజుల పాటు శ్రీవారి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Also Read: