CM Jagan Review: వారికి తక్షణమే రూ.1000 ఇవ్వండి.. జల విలయంపై సీఎం జగన్ ఎమర్జెన్సీ రివ్యూ..
చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో జల విలయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అత్యవసర రివ్యూ నిర్వహించారు. కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరద బీభత్సాన్ని..
చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో జల విలయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అత్యవసర రివ్యూ నిర్వహించారు. కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరద బీభత్సాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టాలని జగన్ సూచించారు. శిబిరాల్లో ఉన్నవారికి రూ.1000 చొప్పున తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో అన్ని రకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. తిరుమల, తిరుపతిలో పరిస్థితిని ప్రత్యేకంగా ఆరా తీశారు. ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా కొండపై కుండపోత వర్షం కురడంతో తిరుమల టెంపుల్‌ను వరద నీరు ముంచెత్తిందని సీఎంకు వివరించారు అధికారులు. దాంతో, యుద్ధప్రాతిపదికన NDRF, SDRF సిబ్బందిని రప్పించుకోవాలని ఆదేశించారు జగన్.
రిజర్వాయర్లు, చెరువుల దగ్గర ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా చేస్తూ చర్యలు చేపట్టాలని సీఎం జగన్ సూచించారు. వరద తీవ్రతను బట్టి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే, వైద్యారోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.
చిత్తూరు జిల్లాలో..
చిత్తూరు జిల్లాలో 20కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం కారణంగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. చంద్రగిరి మండలంలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయ్. నారావారిపల్లిలోని చంద్రబాబునాయుడు ఇంట్లోకి కూడా వరద నీరు ముంచెత్తింది. మరోవైపు భారతి విద్యాభవన్‌ను వరద నీరు ముంచెత్తడంతో 80మంది విద్యార్ధులు చిక్కుకుపోయారు. దాంతో, స్కూల్‌లోనే స్టూడెంట్స్‌కు వసతి ఏర్పాటు చేశారు అధికారులు.
తిరుమలలో..
కొండపై కురిసిన కుండపోత వర్షానికి తిరుమల, తిరుపతి విలవిల్లాడిపోయాయ్. కపిలతీర్థం ఉగ్రరూపానికి తిరుపతి పట్టణం మొత్తం నీట మునిగింది. ఇక, తిరుమలలో అయితే ఎటుచూసినా జల ప్రళయమే కనిపిస్తోంది. గోవింద నామస్మరణతో మారుమోగే తిరుమల పరిసరాలన్నీ వరద గోస వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి: CM Jagan: కుప్పం ఎఫెక్ట్‌తో అసెంబ్లీకి రాలేదేమో.. చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు..
ఒక్క స్ట్రోక్‌తో కోటీశ్వరులైన మదుపరులు.. గతేడాది రూ. 12 పెట్టుబడి పెడితే ఇప్పుడెంతో తెలుసా?